ఏకంగా 84కిమీ మైలేజ్

TVS Jupiter CNG : పెరుగుతున్న ఇంధన ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. గత సంవత్సరం బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి, కొత్త ఫ్యూయెల్ ఆప్షన్ పరిచయం చేసింది. ఆ బైక్ మైలేజ్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, అది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, కంపెనీలు సీఎన్జీ మోడళ్లను విడుదల చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ కూడా చేరింది. ఈ స్కూటర్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టీవీఎస్ ప్రదర్శించింది. ఇది స్కూటర్ మార్కెట్‌లో ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

టీవీఎస్ జూపిటర్ CNG కంపెనీ నుండి నేరుగా ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్జీ కిట్‌తో వచ్చే మొట్టమొదటి స్కూటర్ అవుతుంది. దీని లాంచ్‌ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలోనే విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ సీఎన్జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడుస్తుంది. సాధారణంగా పెట్రోల్ స్కూటర్లు 45 నుండి 50 కి.మీ./లీ. మైలేజ్ ఇస్తాయి. అయితే, ఈ సీఎన్జీ స్కూటర్ మాత్రం దానికి మించి మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టీవీఎస్ ప్రకారం.. ఇది కిలో సీఎన్జీకి 84 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

ఈ స్కూటర్‌లో 124.8cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 5.3 కిలోవాట్ల పవర్, 9.4 న్యూటన్ మీటర్ల టార్క్ అందిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ రెండింటినీ కలిపి ఈ స్కూటర్ 226 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ గంటకు 80.5 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ మరియు 1.4 కిలోల సీఎన్జీ ట్యాంక్ ఉన్నాయి. ఒక బటన్‌ను నొక్కడం ద్వారా పెట్రోల్ నుండి సీఎన్జీకి లేదా సీఎన్జీ నుండి పెట్రోల్‌కి సులభంగా మారవచ్చు.

స్కూటర్ సెగ్మెంట్‌లోనే అత్యంత పెద్ద సీటు దీనికి ఉంది. మెటల్ బాడీ, బయటి నుంచి ఫ్యూయల్ నింపే అవకాశం, ముందు భాగంలో మొబైల్ ఛార్జర్, సెమీ డిజిటల్ స్పీడోమీటర్ వంటివి ఉన్నాయి. బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ, ఎక్కువ లెగ్‌స్పేస్, ETFI టెక్నాలజీ, ఇంటిలిగో టెక్నాలజీ, ఆల్ ఇన్ వన్ లాక్, ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టీవీఎస్ ఈ స్కూటర్‌ను 2025 చివరి నాటికి విడుదల చేయాలని యోచిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.లక్ష వరకు ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story