Renault Kiger : ఈ నెల ఈ ఫ్యామిలీ కారు కొంటే ఏకంగా రూ.90000 లాభం
కారు కొంటే ఏకంగా రూ.90000 లాభం

Renault Kiger : ఈ ఆగస్టు నెలలో కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, దేశంలోనే అత్యంత చవకైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన రెనో కైగర్ కారును కొనుగోలు చేస్తే ఏకంగా రూ.90,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ ఈ కారుపై అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు, కారు ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆగస్టు నెలలో రెనో కైగర్ కారును కొనుగోలు చేస్తే ఈ కారుపై రూ.40,000 వరకు నగదు డిస్కౌంట్ లభిస్తుంది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.50,000 వరకు అదనపు బోనస్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్‌లను కలిపితే మీరు మొత్తం రూ.90,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కైగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.7.39 లక్షల నుంచి మొదలవుతుంది.
అప్‌డేటెడ్ రెనో కైగర్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 72 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 100 bhp పవర్, 152 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా ఉంటుంది. అలాగే, నాచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్‌కు ఏఎమ్‌టీ, టర్బో వేరియంట్‌కు సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ప్రయాణాలకు భద్రత చాలా ముఖ్యం. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో రెనో కైగర్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.ఈ కారులో మొత్తం 4 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
సీటు బెల్ట్‌లు, ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యే డోర్‌లు, వేగానికి అనుగుణంగా ఆటో-లాక్ అయ్యే డోర్‌లు, పిల్లల సేఫ్టీ కోసం ఐఎస్ఓఫిక్స్ (ISOFIX) మౌంట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పవర్ విండోలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా కైగర్‌లో లభిస్తాయి. ఈ కారుకు 16-అంగుళాల ఫ్లెక్స్ వీల్స్ ఉన్నాయి. ఇవి కారుకు మరింత అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.
