డిసెంబర్ లో కొంటేనే లాభం..లేదంటే జేబుకు చిల్లు ఖాయం

Ather Energy : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం ఏథర్ ఎనర్జీ తన కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్, ఒక స్వీట్ న్యూస్ చెప్పింది. ముడిసరుకు ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు ఆకాశాన్ని తాకడం వంటి కారణాలతో ఏథర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ ధరల పెంపు నుంచి తప్పించుకోవడానికి, భారీ ఆఫర్లను సొంతం చేసుకోవడానికి డిసెంబర్ నెలే సరైన సమయం అని కంపెనీ సూచిస్తోంది.

ఏథర్ ఎనర్జీ తన అన్ని మోడళ్లపై గరిష్టంగా రూ.3,000 వరకు ధరను పెంచుతోంది. విదేశీ మారక ద్రవ్య విలువల్లో మార్పులు, గ్లోబల్ సప్లై చైన్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ స్పష్టం చేసింది. మీరు జనవరిలో స్కూటర్ కొనాలనుకుంటే, ఇప్పుడు ఉన్న ధర కంటే రూ.3,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ధరల పెంపు కంటే ముందే స్కూటర్ కొనుగోలు చేసే వారికి ఏథర్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఎలక్ట్రిక్ డిసెంబర్ పేరుతో సాగుతున్న ఈ సేల్‌లో దాదాపు రూ. 20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో నేరుగా రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ. 10,000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్లు, ఎంపిక చేసిన మోడళ్లపై Eight70 ప్రోగ్రామ్ కింద 8 సంవత్సరాల పొడిగించిన బ్యాటరీ వారంటీ పూర్తిగా ఉచితం. పాత పెట్రోల్ బైక్‌ను మార్చుకుంటే అదనపు బోనస్ లభిస్తుంది.

ప్రస్తుతం ఏథర్ మార్కెట్లో రెండు రకాల స్కూటర్ సిరీస్‌లను విక్రయిస్తోంది.

450 సిరీస్ (పర్ఫార్మెన్స్): స్పీడ్ ఇష్టపడే వారి కోసం రూపొందించిన ఈ సిరీస్‌లో MagicTwist (బ్రేక్ వేయకుండానే వేగాన్ని తగ్గించే టెక్నాలజీ), మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

రిజ్టా (ఫ్యామిలీ స్కూటర్): ఇది ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా పెద్ద సీటు, 56 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. ఇటీవల ఇది 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ఇందులో స్కిడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

2013లో తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ప్రారంభించిన ఈ కంపెనీ.. 2018లో తన మొదటి స్కూటర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియాలో మాత్రమే కాకుండా నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా ఏథర్ తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏథర్ కి 4,322 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కంపెనీ తన టెక్నాలజీకి సంబంధించి వందల సంఖ్యలో పేటెంట్లు, డిజైన్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉండి, ఈవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story