చేతక్ వర్సెస్ ఐక్యూబ్ ఏది బెస్ట్

Bajaj Chetak 3001 vs TVS iQube : పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత చౌకైన, సౌకర్యవంతమైన ఎంపికగా మారాయి. ఈ విభాగంలో బజాజ్ చేతక్ 3001, టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh మోడళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ రెండు స్కూటర్లు పవర్ఫుల్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వచ్చినా, మీ అవసరాలకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి వాటి మధ్య తేడాలను వివరంగా పోల్చి చూద్దాం.

ధర

ముందుగా ధర విషయానికి వస్తే బజాజ్ చెతక్ 3001 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.99,990 గా ఉంది. దీనితో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh ధర రూ.94,434 నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఐక్యూబ్ సుమారు రూ.5,000 తక్కువగా లభిస్తుంది. మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంటే, టీవీఎస్ ఐక్యూబ్ మెరుగైన ఎంపిక అవుతుంది.

రేంజ్, ఛార్జింగ్ సామర్థ్యం

చేతక్ 3001: ఇందులో 3.2 kWh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 127 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీనికి పూర్తిగా ఛార్జ్ కావడానికి 3.5 గంటలు పడుతుంది.

ఐక్యూబ్ 2.2 kWh: ఇందులో 2.2 kWh బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 100 కి.మీ. రేంజ్ ఇస్తుంది, కానీ కేవలం 2.5 గంటల్లోనే ఛార్జ్ అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారిక చేతక్ ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అదే తక్కువ దూర ప్రయాణాలు ఉండి, స్కూటర్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఐక్యూబ్ అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్లు, డిజైన్ పోలిక

రెండు స్కూటర్లు టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉన్నాయి.

బజాజ్ చేతక్ : ఇందులో డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్, రివర్స్ మోడ్, ముఖ్యంగా బ్యాటరీ రక్షణ కోసం IP67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ బ్యాటరీ వంటి ఫీచర్లు లభిస్తాయి. డిజైన్ పరంగా చెతక్ కొంచెం క్లాసిక్ లుక్‌ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్ : ఇందులో పెద్ద TFT స్క్రీన్, నావిగేషన్ అసిస్ట్, కాల్-అలర్ట్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూబ్ పూర్తిగా టెక్నాలజీని ఇష్టపడేవారికి నచ్చేలా మోడ్రన్ లుక్‌తో ఉంటుంది.

తుది నిర్ణయం

మీరు రోజూ ఎక్కువ దూరం (సుమారు 100 కి.మీ.కి పైగా) ప్రయాణం చేసి, మీ స్కూటర్‌కు IP67 వంటి మెరుగైన బ్యాటరీ రక్షణ, దృఢమైన క్లాసిక్ డిజైన్ కావాలనుకుంటే... బజాజ్ చేతక్ 3001 ఎంచుకోవచ్చు. మీరు తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్, నావిగేషన్ వంటి స్మార్ట్ టెక్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తే... టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh సరైన ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story