Bajaj Triumph Thruxton : పిచ్చెక్కించే ఫీచర్లు.. తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో బజాజ్ ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400R
తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో బజాజ్ ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400R

Bajaj Triumph Thruxton : భారతీయ మార్కెట్‌లో బజాజ్ ఆటో, ట్రయంఫ్ భాగస్వామ్యంతో సరికొత్త కేఫ్ రేసర్ మోటార్‌సైకిల్ రాబోతోంది. కేఫ్ రేసర్ సెగ్మెంట్ అత్యంత ప్రత్యేకమైనప్పటికీ బజాజ్ ఈ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేయవచ్చని భావిస్తోంది. అంతేకాకుండా, థ్రక్స్‌టన్ 400 స్పోర్టీ వెర్షన్ థ్రక్స్‌టన్ 400Rను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బజాజ్ ఆటో ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400 ను భారతదేశంలో అత్యంత సరసమైన కేఫ్ రేసర్ మోటార్‌సైకిల్‌గా నిలిపింది. ఈ బైక్ విడుదలైన మూడు వారాల్లోనే మంచి స్పందన లభించింది. బజాజ్ కంపెనీ థ్రక్స్‌టన్ 400 కు ఒక స్పోర్టీ R వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ థ్రక్స్‌టన్ 400R లో మెరుగైన బ్రేకులు, టాప్-స్పెక్ సస్పెన్షన్, కొత్త బాడీ వర్క్ ఉండే అవకాశం ఉంది. బజాజ్ వేగంగా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే సంస్థ కాబట్టి, థ్రక్స్‌టన్ 400R ఒకటి లేదా రెండు సంవత్సరాలలో మార్కెట్‌లోకి వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
సీఎన్‌బీసీ (CNBC) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక చిన్న క్లిప్‌లో బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కొత్త జీఎస్‌టీ రేట్ల తగ్గింపుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ-వీలర్‌లపై జీఎస్‌టీ రేటు 28% నుండి 18% కు తగ్గించడంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ పన్ను రేటును 28% నుండి 18% కి తగ్గించి గొప్ప ఉపకారం చేయలేదని, 18% కూడా ఇప్పటికీ అధికమేనని అన్నారు. 12% సగటుతో పోలిస్తే ఇది 50% అధికమని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ తగ్గింపును అభినందిస్తూ ఇది స్వాగతించదగిన విషయమని తెలిపారు.
రాజీవ్ బజాజ్ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. భారతదేశంలో అమ్ముడయ్యే 97 నుండి 98 శాతం టూ-వీలర్లు 350సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్నవని, కాబట్టి 350సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను అధిక పన్నుల నుండి మినహాయించడం అర్థరహితమని అన్నారు. అన్ని టూ-వీలర్‌లపై 18% పన్ను ఎందుకు విధించలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా పన్ను రేట్లలో తేడా చూపించడం వల్ల వాహన తయారీదారులు తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మార్చక తప్పడం లేదని అన్నారు.
