Bajaj Pulsar N160 : సరికొత్తగా మార్కెట్లోకి బజాజ్ పల్సర్ N160.. అపాచీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం
అపాచీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం

Bajaj Pulsar N160 : భారతీయ యువతను దశాబ్దాలుగా ఉర్రూతలూగిస్తున్న మోస్ట్ పాపులర్ బైక్ బ్రాండ్ బజాజ్ పల్సర్ సరికొత్త అవతారంలో మార్కెట్లోకి దూసుకొచ్చింది. 160 సీసీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు బజాజ్ ఆటో సంస్థ పల్సర్ N160 అప్‌డేటెడ్ వేరియంట్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈ సరికొత్త బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.22 లక్షలుగా నిర్ణయించారు. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్ వెళ్లే కాలేజ్ కుర్రాళ్లను, ఆఫీస్ గోయర్స్ ను టార్గెట్ చేస్తూ.. సూపర్ బైక్స్ లో ఉండే ప్రీమియం ఫీచర్లను ఈ బడ్జెట్ బైక్‌లోకి జోడించడం విశేషం. మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త పల్సర్.. టీవీఎస్ అపాచీ, యమహా ఎఫ్‌జెడ్ బైక్‌లకు నిద్ర లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సరికొత్త పల్సర్ N160 లో అందరినీ ఆకట్టుకునే అతిపెద్ద మార్పు.. కంటికి ఆకర్షణీయంగా కనిపించే గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్. ఇన్నాళ్లూ కేవలం రూ.2 లక్షలకు పైగా ధర ఉండే రేసింగ్ స్పోర్ట్స్ బైకుల్లో మాత్రమే కనిపించే ఈ ప్రీమియం సస్పెన్షన్‌ను ఇప్పుడు బజాజ్ ఈ 160 సీసీ బైక్‌లో పరిచయం చేసింది. ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ వల్ల బైక్‌కు ఒక రేసింగ్ లుక్ రావడమే కాకుండా.. హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు, రోడ్లపై షార్ప్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు బైక్ అస్సలు ఊగకుండా అద్భుతమైన రోడ్ గ్రిప్, స్టెబిలిటీని అందిస్తుంది.
కుర్రాళ్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఈ బైక్‌లో టాప్-క్లాస్ ఫీచర్లను ఇచ్చింది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని వాడారు. దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్లు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు వెనుక వీల్ లాక్ అవ్వకుండా చాలా స్మూత్‌గా రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. దీనివల్ల వర్షంలో లేదా ఇసుక రోడ్లపై సడన్ బ్రేక్ వేసినా బైక్ అస్సలు స్కిడ్ అవ్వదు.
టెక్నాలజీ పరంగా ఈ బైక్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఇందులో సరికొత్త నెగటివ్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. దీని టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. దీని ద్వారా రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసుకుని కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను స్క్రీన్ పైనే చూడవచ్చు. అదనంగా ఇందులో విభిన్న రోడ్ కండిషన్స్ కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ ను కూడా ఇచ్చారు. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరే సరికొత్త USB Type-C ఛార్జింగ్ పోర్టును కూడా సెట్ చేశారు.
రాత్రి పూట రోడ్లు పగలులా కనిపించేలా ఈ బైక్‌కు సిగ్నేచర్ స్టైల్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను ఇచ్చారు. 17-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ బైక్ అందాన్ని మరింత పెంచాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే.. పాత నమ్మకమైన పవర్‌ఫుల్ 160cc సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌నే కొనసాగించారు. ఇది సిటీ ట్రాఫిక్‌లో క్విక్ పికప్‌ను ఇస్తూనే.. లీటరుకు దాదాపు 45-50 కిమీ మైలేజ్‌ను సునాయాసంగా అందిస్తుంది. ఈ సరికొత్త అప్‌డేట్లతో ఇది మార్కెట్లో ఉన్న సుజుకి జిక్సర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V లతో కూడా గట్టిగా తలపడనుంది.

