Bajaj Pulsar : బజాజ్ ఆటో తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ NS400Z విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. బైక్ ఇంజిన్ సామర్థ్యంలో చిన్న మార్పు చేయడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించి, ఆ లాభాన్ని నేరుగా కస్టమర్లకు బదిలీ చేసింది. దీనివల్ల పల్సర్ లవర్స్‌కు ఏకంగా రూ.24,500 వరకు ఆదా అయ్యే అవకాశం కలిగింది. ఏప్రిల్ 30, 2026న వెలువడిన ఈ అప్‌డేట్ ఇప్పుడు టూ వీలర్ మార్కెట్‌లో హాట్ టాపిక్ అయింది. బజాజ్ పల్సర్ NS400Z ధర తగ్గడానికి ప్రధాన కారణం దాని ఇంజిన్ సామర్థ్యంలో చేసిన మార్పు. గతంలో ఈ బైక్‌లో 373cc ఇంజిన్ ఉండేది. ఇప్పుడు దానిని 349ccకి తగ్గించారు. దీనివల్ల ఈ బైక్ 18% జిఎస్‌టి స్లాబ్‌లోకి వచ్చేసింది. ఫలితంగా బైక్ ధరపై పన్ను భారం తగ్గి, ఎక్స్-షోరూమ్ ధరలో సుమారు రూ.24,500 మేర కోత పడింది. ఇప్పుడు ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,80,092 గా ఉంది. గతంలో ఇది దాదాపు రూ.1.93 లక్షల కంటే ఎక్కువగా ఉండేది.

ఇంజిన్ సామర్థ్యం తగ్గించినప్పటికీ, పర్ఫామెన్సులో పెద్దగా తేడా రాకుండా బజాజ్ జాగ్రత్త పడింది. కొత్త 349cc ఇంజిన్ 40 bhp పవర్‌ను, 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత 373cc ఇంజిన్‌తో పోలిస్తే పవర్ 2.4 bhp, టార్క్ కొంచెం తగ్గింది. అయితే, ఇంజిన్ స్ట్రోక్ తగ్గించినా, బోర్ సైజును మాత్రం అలాగే ఉంచడం వల్ల రైడింగ్ అనుభూతిలో పెద్దగా వ్యత్యాసం కనిపించదు. స్పోర్ట్స్ బైక్ ప్రియులకు కావలసిన స్పీడ్ ఇది ఇప్పటికీ అందిస్తుంది.

ధర తగ్గడం వల్ల కస్టమర్లకు కేవలం ఎక్స్ షోరూమ్ ధరలోనే కాదు, ఆన్-రోడ్ ధరలో కూడా భారీగా ఆదా అవుతుంది. బైక్ అసలు ధర తగ్గడంతో దానిపై కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. అంటే మొత్తం మీద కస్టమర్ జేబులో నుంచి వెళ్లే సొమ్ము భారీగా తగ్గుతుందన్నమాట. మధ్యతరగతి కుర్రాళ్లకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

ధర తగ్గించినప్పటికీ, బైక్‌లోని అదిరిపోయే ఫీచర్లను మాత్రం బజాజ్ అలాగే ఉంచింది. ఇందులో మునుపటిలాగే మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ (Road, Rain, Sport, Off-road), క్విక్‌షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే రేడియల్ టైర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న డిజిటల్ కన్సోల్ కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న పవర్ ఫుల్ బైక్ కావాలనుకునే వారికి ఇప్పుడు పల్సర్ NS400Z బెస్ట్ ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story