మైలేజీలో కింగ్స్ ఈ 5 బైక్లే

Budget Bikes : భారతదేశంలో గ్రామాల్లో ఉండే రోడ్లు, అక్కడి ప్రయాణ అవసరాలు పట్టణాల కంటే భిన్నంగా ఉంటాయి. గుంతల రోడ్లు, మట్టి దారులు, మేట వేసిన ఇసుక తిన్నెల్లో ప్రయాణించాలంటే బండి గట్టిగా ఉండాలి.. అలాగే జేబుకు చిల్లు పడకుండా మైలేజీ కూడా భారీగా ఇవ్వాలి. అందుకే పల్లెటూరి జనం ఎక్కువగా నమ్మే, తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని ఇచ్చే టాప్-5 బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ ప్లస్

పల్లెటూరి రోడ్లపై రారాజు ఎవరంటే కళ్లు మూసుకుని చెప్పే పేరు స్ప్లెండర్. దశాబ్దాలుగా భారతీయ గ్రామీణ మార్కెట్‌ను ఏలుతున్న ఈ బైక్ ధర సుమారు రూ. 74,902. ఇందులో 97.2cc ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు దాదాపు 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనిలోని i3S టెక్నాలజీ పెట్రోల్ ఆదా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ బైక్ విడిభాగాలు ఏ చిన్న పల్లెటూరి మెకానిక్ షెడ్డులోనైనా దొరుకుతాయి, అందుకే దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ.

బజాజ్ ప్లాటినా 100

మైలేజీకి మారుపేరు బజాజ్ ప్లాటినా. దీని ధర సుమారు రూ.66,000. ఇందులో 102cc ఇంజిన్ ఉంటుంది. ఇది ఏకంగా లీటరుకు 80 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ప్లాటినా ప్రత్యేకత ఏంటంటే దీని సస్పెన్షన్. గుంతల రోడ్లపై వెళ్లేటప్పుడు నడుము నొప్పి రాకుండా ఉండేందుకు దీనికి కంఫర్టెక్ టెక్నాలజీని వాడారు. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

హోండా షైన్ 100

తక్కువ బడ్జెట్‌లో హోండా నమ్మకాన్ని కోరుకునే వారికి షైన్ 100 సరైన ఎంపిక. దీని ధర సుమారు రూ.65,243. ఇందులో 98.98cc ఇంజిన్ ఉంది. ఇది లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులోని IBS బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బండి అదుపు తప్పకుండా ఆగుతుంది. బండి బరువు తక్కువగా ఉండటం వల్ల ఇరుకైన దారుల్లో కూడా సులభంగా నడపవచ్చు.

టీవీఎస్ స్పోర్ట్

బడ్జెట్ బైక్‌లలో స్పోర్టీ లుక్ కావాలనుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.55,500. ఇందులో 109.7cc పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుంది. లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఈ బైక్ బాడీ చాలా గట్టిగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద పెద్ద గట్ల మీద కూడా బండి తగలకుండా వెళ్తుంది.

టీవీఎస్ రేడియాన్ (TVS Radeon):

స్టైల్ మరియు సౌకర్యం రెండూ కావాలనుకునే వారికి టీవీఎస్ రేడియాన్ బెస్ట్. దీని ధర సుమారు రూ. 55,000. ఇది లీటరుకు 69 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో పెద్ద సీటు, డిజిటల్ మీటర్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ (LED DRL) వంటి ఫీచర్లు ఉన్నాయి. చూడటానికి క్లాసిక్ లుక్ లో ఉండే ఈ బైక్ పల్లెటూరి పెద్దలకు బాగా సెట్ అవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story