Compact Cars : ప్రస్తుత రోజుల్లో నగరాల్లో వాహనం నడపడం అనేది కత్తిమీద సాములా మారింది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకైన పార్కింగ్ స్థలాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులను తట్టుకోవడం సామాన్యుడికి పెద్ద టాస్క్. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ప్రయాణాల కోసం ఒక చిన్న, సౌకర్యవంతమైన కారును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇస్తూ, నడపడానికి సులభంగా ఉండే ఐదు అత్యుత్తమ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల వివరాలను ఇక్కడ ప్రత్యేకంగా విశ్లేషించాం.

ఎప్పటికీ ఎవర్ గ్రీన్.. మారుతి స్విఫ్ట్

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో మారుతి స్విఫ్ట్ ముందుంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షల నుంచి రూ.8.80 లక్షల మధ్యలో ఉంది. ఇందులో పవర్ఫుల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది మ్యాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. సిటీ రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. భద్రత కోసం ఇందులో సరికొత్తగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రేర్ వ్యూ కెమెరాను అమర్చారు.

సిటీ డ్రైవింగ్ కింగ్.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

నగర ప్రయాణాలకు హ్యుందాయ్ అందిస్తున్న అద్భుతమైన కాంపాక్ట్ కారు గ్రాండ్ ఐ10 నియోస్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.04 లక్షల వరకు ఉంది. ఈ కారులో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని క్లచ్ చాలా లైట్‌గా ఉండటం, గేర్లు చాలా స్మూత్‌గా పడటం వల్ల ఎంతటి భారీ ట్రాఫిక్‌లోనైనా సరే డ్రైవర్ అస్సలు అలసిపోకుండా హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు.

చిచ్చరపిడుగు లాంటి ఏఐ కారు.. ఎంజీ కామెట్ ఈవీ

పెట్రోల్ ఖర్చులకు పూర్తిగా గుడ్ బై చెప్పాలనుకునే వారికి ఎంజీ కామెట్ ఈవీ ఒక స్మార్ట్ ఛాన్స్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.9.56 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 17.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ చార్జ్‌పై ఏకంగా 230 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. చాలా చిన్న సైజులో ఉండటం వల్ల దీనిని పార్కింగ్ చేయడం చాలా ఈజీ. ఇందులో సేఫ్టీ కోసం రేర్ వ్యూ కెమెరా, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఈఎస్‌సీ, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించారు.

ఆటోమేటిక్ గేర్లతో టాటా టియాగో సీఎన్‌జీ ఐ-సీఎన్‌జీ

సీఎన్‌జీ కార్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారి కోసం టాటా టియాగో సీఎన్‌జీ ఏఎంటీ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5.80 లక్షల నుంచి రూ.8.55 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది నార్మల్ మోడ్‌లో 86 PS పవర్ ఇస్తుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ మోడ్‌లో ఇది 76 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా సిగ్నేచర్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వల్ల డిక్కీలో స్పేస్ అస్సలు తగ్గదు. ఇందులో 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

కరెంట్ పవర్‌తో టాటా టియాగో ఈవీ రచ్చ

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో బడ్జెట్ కింగ్‌గా పేరొందింది టాటా టియాగో ఈవీ. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో అందుబాటులో ఉంది. ఈ కారు 19.2 kWh, 24 kWh అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ఫుల్ చార్జ్ రేంజ్ ఏకంగా 285 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఇందులో బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఈ ఐదింటిలో బెస్ట్ కారును ఎంచుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story