టాటా టియాగోను వెనక్కి నెట్టి మరీ నెం.1గా నిలిచిన కారు

WagonR : హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో జూలై 2025లో అమ్మకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని పాపులర్ మోడల్స్ అమ్మకాలు పెరగగా, మరికొన్నింటి అమ్మకాలు తగ్గాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా, హ్యుందాయ్ వంటి కంపెనీల మోడల్స్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాయి. కొత్త హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే జూలైలో ఏ కారు నంబర్ 1 స్థానంలో నిలిచిందో తెలుసుకుందాం.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ కారు అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ, ఇది అగ్రస్థానాన్ని నిలుపుకుంది. 2024లో ఈ కారు 16,191 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది జూలైలో 14,710 యూనిట్లు అమ్ముడయ్యాయి.

రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఉంది. గత ఏడాది జూలైలో 16,854 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది జూలైలో 16 శాతం తగ్గి 14,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. మూడో స్థానంలో బలేనో (13,446 యూనిట్లు), నాలుగో స్థానంలో ఆల్టో (12,187 యూనిట్లు) ఉన్నాయి. ఈ రెండు కార్ల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి.

టాటా మోటార్స్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఐదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలైలో ఈ కారు 5,665 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది జూలైలో 2 శాతం తగ్గి 5,575 యూనిట్లు అమ్ముడయ్యాయి. టయోటా గ్లాంజా ఆరవ స్థానంలో ఉంది. ఈ కారు అమ్మకాలు 4 శాతం పెరిగాయి. టాటా ఆల్ట్రోజ్ ఏడవ స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 13 శాతం పెరిగాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలు వరుసగా 28 శాతం, 32 శాతం, 11 శాతం తగ్గాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story