Electric Scooter Sales: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విభాగంలో బజాజ్, టీవీఎస్, ఏథర్, ఓలా వంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలతో పోటీపడుతూ ముంబైకి చెందిన బీగ్రాస్ ఆటో అనే చిన్న స్టార్టప్ కంపెనీ అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 16 మధ్య కాలంలో సుమారు 32,627 ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులకు డెలివరీ చేసి సంచలనం సృష్టించింది. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఈ సంస్థ రికార్డు స్థాయి వృద్ధిని సాధించింది. ముఖ్యంగా జూలై, ఆగస్ట్ నెలల్లో వేల సంఖ్యలో స్కూటర్లను విక్రయించి ఆటోమొబైల్ మార్కెట్లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

అత్యుత్తమ ఫీచర్లతో వస్తున్న బీగ్రాస్ సీ12 మ్యాక్స్ఆర్

ఈ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ సీ12 మ్యాక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్కూటర్‌లో అమర్చిన 3.8 kWh ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్ బెస్ట్ పర్ఫామెన్స్ కడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 178 కిలోమీటర్ల సుదూర ప్రయాణపు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఇందులో ఈకో, రైడ్ అలాగే స్పోర్ట్ అనే మూడు రకాల రైడింగ్ మోడ్స్‌తో పాటు రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించారు. ఇది సిటీ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది.

ధర అలాగే సబ్సిడీ ప్రత్యేకతలు

ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,60,000 వరకు ఉండగా, పరిచయ ఆఫర్లు అలాగే పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ మినహాయింపుల ద్వారా దీని ప్రభావవంతమైన ధర సుమారు రూ.1,45,990 వరకు తగ్గుతుంది. సరసమైన ధరలో లభించే సుదూర ప్రయాణపు రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కారణంగా కస్టమర్లు ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయడానికి అమితాసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించి మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Next Story