ఇదే మంచి ఛాన్స్.. హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు!

Honda : కొత్త కారు కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లాంటి పాపులర్ కార్లకు పోటీ ఇచ్చే హోండా ఎలివేట్ ఎస్‌యూవీపై కంపెనీ భారీ తగ్గింపులు ప్రకటించింది. ఈ జూలై నెలలో ఏకంగా రూ.1.20 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఎలివేట్ కారు బేస్ మోడల్ కొనాలంటే రూ.11.91 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవుతుంది. టాప్ మోడల్‌కు రూ.16.73 లక్షలు అవుతుంది. ఈ డిస్కౌంట్లతో ధర మరింత తగ్గుతుంది.

ఎలివేట్ తో పాటు, హోండా సిటీ, అమేజ్‌ కార్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. హోండా సిటీ కారుపై రూ.1.07 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. హోండా అమేజ్ రెండో తరం మోడల్‌పై రూ.57,200 వరకు డిస్కౌంట్ ఉంది. అయితే, కొత్త తరం అమేజ్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు.

హోండా మాత్రమే కాదు, హ్యుందాయ్ కూడా తమ కార్లపై జూలైలో రూ.లక్ష వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. ఏయే మోడల్స్‌పై ఎంత తగ్గింపు అనేది ఇంకా చెప్పలేదు, కానీ మీ దగ్గరలోని డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్లు వివిధ ప్రాంతాలు, కారు మోడల్స్, వేరియంట్లను బట్టి మారవచ్చు. హోండా కార్ల ఆఫర్లు జూలై 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొత్త కారు కొనేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story