SUV Discounts : బంపర్ ఆఫర్..ఎస్యూవీ కారు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..స్కోడా కుషాక్ పై రికార్డు డిస్కౌంట్
ఎస్యూవీ కారు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..స్కోడా కుషాక్ పై రికార్డు డిస్కౌంట్

Skoda Kushaq Offer : 2025 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, జనవరిలో కార్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, డిసెంబర్ నెల కార్లు కొనడానికి అత్యుత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈసారి ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో రికార్డు స్థాయిలో తగ్గింపులు లభిస్తున్నాయి. కొన్ని మోడల్స్‌పై ఏకంగా రూ.3 లక్షలకు పైగా ప్రయోజనాలు అందిస్తున్నారు. మీరు చాలా కాలంగా కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ డిసెంబర్ డీల్స్ మీకు ఖచ్చితంగా సరైన అవకాశాన్ని అందిస్తాయి.
ప్రీమియం SUVలపై భారీ డిస్కౌంట్‌లు
ఈసారి మార్కెట్‌లో అత్యంత భారీ డిస్కౌంట్ స్కైడా కుషాక్ పై లభిస్తోంది. ఈ ప్రముఖ మిడ్-సైజ్ SUVపై కంపెనీ ఏకంగా రూ.3.25 లక్షల వరకు ఆఫర్‌ను అందిస్తోంది. కుషాక్‌లో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లు అద్భుతమైన పర్ఫామెన్స్‌కు పేరుగాంచాయి. ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో జీప్ కంపాస్ ఉంది, దీనిపై రూ.2.55 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. దీని 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్,4WD సామర్థ్యం దీనిని బలమైన ఎంపికగా నిలబెడుతుంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కూడా ఈ నెలలో రూ.2 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.
మిడ్-బడ్జెట్ SUVలలో బెస్ట్ డీల్స్
మీరు రూ.15 లక్షల బడ్జెట్ రేంజ్‌లో SUV కోసం చూస్తున్నట్లయితే హోండా ఎలివేట్ ఈ నెలలో రూ.1.76 లక్షల వరకు తగ్గింపుతో ఆకర్షణీయమైన డీల్‌ను అందిస్తోంది. ఇక సరసమైన ధరలో మంచి SUV కావాలనుకునే వారికి నిస్సాన్ మాగ్నైట్ పై రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇది వాల్యూ-ఫర్-మనీ డీల్‌గా నిలుస్తోంది. ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే వారి ఫేవరెట్ అయిన మారుతి సుజుకి జిమ్నీ పై కూడా ఈసారి రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటు కియా సైరోస్, ఎంజి హెక్టర్ కార్లపై కూడా రూ.90,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
చిన్న SUVలలో కూడా మంచి ఆదా
కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై రూ.85,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ కారు దాని ఫీచర్లు, భద్రత, మైలేజ్ కారణంగా చాలా మంది కుటుంబ కొనుగోలుదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఏది ఏమైనా జనవరి 2026లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ డిసెంబర్ చివరి ఆఫర్‌లను ఉపయోగించుకోవడం ద్వారా కారు కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

