BMW : చరిత్రను తిరగరాయబోతున్న బీఎండబ్ల్యూ..ఈ మేడ్ ఇన్ ఇండియా కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఈ మేడ్ ఇన్ ఇండియా కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా?

BMW : లగ్జరీ కార్ల ప్రియులకు బీఎండబ్ల్యూ ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. మేడ్-ఇన్-ఇండియా ట్యాగ్‌తో సరికొత్త స్పోర్ట్స్ ఎస్‌యూవీ BMW X3 30 xDrive M Sport Proని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారైన ఈ కారు ధరను రూ.74.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ షోరూమ్‌లలో దీని బుకింగ్స్ షురూ అయ్యాయి. ఎక్స్3 సిరీస్‌లో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను పెంచడం ద్వారా లగ్జరీ ఎస్‌యూవీ కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసింది.
ఈ కొత్త మోడల్‌లో 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది అత్యంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనికి తోడు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బీఎండబ్ల్యూ సిగ్నేచర్ ఆల్-వీల్-డ్రైవ్ (xDrive) సిస్టమ్ ఉండటంతో డ్రైవింగ్ అనుభవం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. మెరుగైన మైలేజీ, పర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఒక చిన్న హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా జోడించడం విశేషం.
చూడగానే కైపెక్కించేలా ఉండే ఈ కారు 4,755 mm పొడవు, 1,920 mm వెడల్పును కలిగి ఉంది. దీనికి అడాప్టివ్ సస్పెన్షన్ ఉండటం వల్ల రోడ్డు పరిస్థితిని బట్టి కారు తనను తాను అడ్జస్ట్ చేసుకుంటుంది. బయట వైపు బ్లాక్ గ్రిల్, అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, 20 అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ దీనికి ఒక పక్కా స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. లోపల కూడా విలాసానికి లోటు లేదు.
కారు లోపల అడుగుపెడితే ఒక పెద్ద కర్వ్డ్ డిస్‌ప్లే మనకు స్వాగతం పలుకుతుంది. ఇందులో 12.3 అంగుళాల, 14.9 అంగుళాల రెండు భారీ స్క్రీన్లు ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ కోసం 15 స్పీకర్లతో కూడిన హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెెంటిలేటెడ్ సీట్లు, ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించడానికి పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ కారు నడుస్తుంది.
సేఫ్టీ విషయంలో బీఎండబ్ల్యూ ఎప్పుడూ రాజీపడదు. ఈ కొత్త ఎస్‌యూవీలో ఏకంగా 8 ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ అసిస్టెన్స్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు గ్రే, వైట్, బ్లూ, బ్లాక్ వంటి ఐదు రకాల ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. లోపల సీట్ల కోసం కూడా రెండు రకాల ప్రీమియం కలర్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. మేడ్-ఇన్-ఇండియా కావడంతో దీని మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ లభ్యత కూడా సులభం కానుంది.

