నెక్సాన్ ఈవీపై రూ. 50,000 వరకు ఆదా

Tata Nexon : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ టాటా కారును కొనుగోలు చేయవచ్చు. టాటా మోటార్స్ తన అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా రూ.50,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీపై లభిస్తున్న ఈ డిస్కౌంట్‌లో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఈ ఆఫర్‌ను పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ ఆఫర్ గురించిన మరింత సమాచారం కోసం సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. టాటా మోటార్స్ ఈవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో నెక్సాన్ ఈవీ ఒకటి.

టాటా నెక్సాన్ ఈవీలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. 30kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్ 129 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 325 కి.మీ రేంజ్ ఇస్తుంది. 40.5kWh బ్యాటరీ ప్యాక్ 144 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 465 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కారులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ కెమెరా, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ కమాండ్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, క్రూజ్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్ పరంగా నెక్సాన్ ఈవీలో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్, హాలోజన్ ల్యాంప్స్, ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కారుకు 5-స్టార్ ఎన్‌సీఏపీ రేటింగ్ లభించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400తో పోటీ పడుతోంది. నెక్సాన్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్‌కు రూ. 17.19 లక్షల వరకు ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story