BYD: గంటకు 503 కిమీ స్పీడ్.. ప్రపంచ రికార్డును తిరగరాసిన బివైడి ఎలక్ట్రిక్ కారు
బివైడి ఎలక్ట్రిక్ కారు

BYD: ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని షాక్ కు గురిచేస్తూ చైనా ప్రముఖ వాహన తయారీ సంస్థ బివైడికి చెందిన లగ్జరీ విభాగం యాంగ్వాంగ్ అద్భుతమైన మైలురాయిని సాధించింది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ హైపర్‌కార్ యాంగ్వాంగ్ U9 ఎక్స్ట్రీమ్ గంటకు ఏకంగా 503.17 కిలోమీటర్ల స్పీడు నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. గంటకు 500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్ కారుగా, అలాగే తొలి ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ వాహనంగా ఇది చరిత్రకెక్కింది.
అబుదాబి వేదికగా నమోదైన సంచలన రికార్డు
నవంబర్ 1, 2026 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబి ప్రాంతంలో ఉన్న అల్ ధఫ్రా ఏరియా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ రోడ్డుపై ఈ హైస్పీడ్ టెస్ట్ నిర్వహించారు. జర్మనీకి చెందిన రేసింగ్ డ్రైవర్ మార్క్ బాసెంగ్ ఈ హైపర్‌కార్‌ను నడిపారు. గతంలో జర్మనీలోని ఏటీపీ ట్రాక్‌పై సాధించిన 496.22 kmph

