కారణం ఏంటి ?

Car Prices : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఉంది. ఇక్కడ రూ. 3.50 లక్షలకే కొత్త కారు కొనవచ్చు. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. అక్కడ కార్ల ధరలు అస్సలు అందుబాటులో లేవు. ఉదాహరణకు భారత్‌లో రూ. 33 లక్షలు ఉండే టయోటా ఫార్చ్యూనర్ ధర పాకిస్థాన్‌లో ఏకంగా రూ. 1.49 కోట్లుగా ఉంది. పాకిస్థాన్‌లో కార్ల ధరలు ఎందుకు ఇంత ఆకాశాన్ని అంటుతున్నాయో, భారత్‌తో ధరల తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారత్‌లో ఆటో మార్కెట్ పరిస్థితి

ఆటోమొబైల్ రంగం భారతీయ ఆర్థిక వ్యవస్థకు (జీడీపీలో 7.1% వాటా) బలమైన మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా జీఎస్‌టీ విధానం (18% లేదా 40% పన్ను) అమలు చేయడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా కారు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత చవకైన కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, దీని ప్రారంభ ధర రూ. 3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).

పాకిస్థాన్‌లో ధరలు పెరగడానికి కారణాలు

భారత్‌లో రూ. 10 లక్షల లోపు ఉండే కార్లు కూడా పాకిస్థాన్ రూపాయిల్లో రూ. 40 లక్షలు దాటుతున్నాయి.దీనికి అనేకా కారణాలు ఉన్నాయి. ఇక్కడ దిగుమతి చేసుకునే కార్లు, విడి భాగాలపై భారీ పన్నులు విధిస్తారు. కార్ల తయారీకి అవసరమైన స్థానిక ఉత్పత్తి దాదాపుగా లేకపోవడం కూడా కార్ల ధరలు అధికంగా ఉండడానికి కారణం. మరో ముఖ్య కారణం పాకిస్థానీ రూపాయి విలువ పడిపోవడం, విదేశాల నుంచి విడి భాగాల సరఫరాలో తరచుగా ఇబ్బందుల వల్ల కూడా ధరలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్య మోడల్స్‌పై వివరాలు

టయోటా ఫార్చ్యూనర్: భారత్‌లో రూ. 33.64 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ ఎస్‌యూవీ కోసం, పాకిస్థాన్‌లో మీరు ఏకంగా రూ. 1.49 కోట్ల పాకిస్థానీ రూపాయలు చెల్లించాలి.

సుజుకి స్విఫ్ట్ (పాత జనరేషన్): భారత్‌లో దీని ప్రారంభ ధర రూ. 5.37 లక్షలు. కానీ, పాకిస్థాన్‌లో పాత తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 44.60 లక్షల పాకిస్థానీ రూపాయలు.

హోండా సిటీ (పాత జనరేషన్): పాకిస్థాన్‌లో ఇప్పటికీ పాత తరం సిటీ మోడల్ అమ్ముడవుతోంది. అక్కడ 1.2 లీటర్ బేస్ వేరియంట్ ధర రూ. 47.37 లక్షల పాకిస్థానీ రూపాయలుగా ఉంది.

టయోటా హైలక్స్: భారత్‌లో రూ. 28.02 లక్షలతో ప్రారంభమయ్యే ఈ పికప్ ఎస్‌యూవీ (అక్కడ రెవో పేరుతో అమ్ముడవుతోంది) కోసం, పాకిస్థానీయులు రూ. 1.23 కోట్ల పాకిస్థానీ రూపాయలు చెల్లించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story