ఇప్పుడు కారు కొంటే లక్షలు మిగులుతాయి

Year-End Discounts :కొత్త కారు కొనాలనే మీ కల నెరవేర్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకోటి ఉండదు. డిసెంబర్ 31 దగ్గరపడుతుండటంతో, కార్ల కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కేవలం మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే లక్షల రూపాయల ఆదా చేసుకోవచ్చు. మారుతి సుజుకి నుంచి మహీంద్రా వరకు ఏ కంపెనీ ఎంత డిస్కౌంట్ ఇస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మారుతి సుజుకి - ఆదా రూ.2 లక్షల వరకు

దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు ఇస్తోంది. వ్యాగన్ఆర్ మీద రూ.61,100, స్విఫ్ట్ మీద రూ.40,000 వరకు తగ్గింపు ఉంది. ఇక ప్రీమియం కార్ల విషయానికి వస్తే బాలెనోపై రూ.53,000 ఆదా చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కొంటే ఏకంగా రూ.2.03 లక్షల భారీ ప్రయోజనం లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిపి ఉన్నాయి.

మహీంద్రా, కియా - భారీ డిస్కౌంట్ల జాతర

మహీంద్రా తన ఎస్‌యూవీలపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలక్ట్రిక్ కారు XUV400 మీద ఏకంగా రూ.4.45 లక్షల భారీ డిస్కౌంట్ ఇస్తోంది. పాపులర్ మోడల్ XUV700 పై రూ.1.55 లక్షలు, స్కార్పియో క్లాసిక్ పై రూ.1.40 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. థార్ రాక్స్ మీద కూడా రూ.1.20 లక్షల ఆఫర్ ఉంది. అటు కియా ఇండియా కూడా ఏమాత్రం తగ్గకుండా ఇన్‌స్పైరింగ్ డిసెంబర్ పేరుతో సెల్టోస్, సోనెట్, కార్నివాల్ వంటి కార్లపై గరిష్టంగా రూ.3.65 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

టాటా మోటార్స్, హ్యుందాయ్ - బడ్జెట్ ధరలో లగ్జరీ

టాటా మోటార్స్ తన సఫారీ మరియు హారియర్ కార్లపై రూ.లక్ష వరకు ఇయర్-ఎండ్ ఆఫర్లు ఇస్తోంది. పాపులర్ కారు టాటా పంచ్ పై రూ.40,000, నెక్సాన్ పై రూ.50,000 డిస్కౌంట్ ఉంది. పాత స్టాక్ ఉన్న అల్ట్రోజ్ మోడల్స్ పై అయితే రూ.85,000 వరకు తగ్గించే అవకాశం ఉంది. ఇక హ్యుందాయ్ విషయానికొస్తే, గ్రాండ్ i10 నియోస్ పై రూ.1.43 లక్షలు, i20 పై రూ.1.68 లక్షలు, ఎక్స్టర్ మోడల్ పై ఏకంగా రూ.1.74 లక్షల వరకు భారీ ప్రయోజనాలు పొందవచ్చు.

ఎందుకు ఇప్పుడే కొనాలి?

ప్రతి ఏటా జనవరి నుంచి కార్ల తయారీ ఖర్చులు పెరుగుతాయని కంపెనీలు ధరలను పెంచుతుంటాయి. ఇప్పటికే రెనాల్ట్, నిస్సాన్ వంటి సంస్థలు 2 శాతం ధరల పెంపును ప్రకటించాయి. కాబట్టి ఇప్పుడు కారు కొంటే మీరు పాత ధరకే పొందడమే కాకుండా, ఇయర్-ఎండ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, తక్కువ వడ్డీకే ఈఎంఐ వంటి వెసులుబాటును పొందవచ్చు. ఈ ఆఫర్లు కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే! ఆ తర్వాత స్టాక్ ముగిసినా లేదా కొత్త ఏడాది వచ్చినా మీరు లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story