.రూ.3.5 లక్షలకే బ్రాండెడ్ కారు

Maruti S-Presso : భారత మార్కెట్లో తక్కువ ధరలో మంచి కార్లు కొనాలనుకునే వారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి వచ్చిన ఆల్టో K10 ఎప్పుడూ చాలా మందికి ఇష్టమైన కారు. దీని ధర రూ.4 లక్షల కంటే తక్కువే. అయితే ఆల్టో K10 కంటే కూడా తక్కువ ధరలో అదే మారుతి కుటుంబం నుంచి వచ్చిన మరో 5-సీటర్ కారు ఉంది. అదే మారుతి ఎస్-ప్రెస్సో. ఈ బ్రాండెడ్ కారు ప్రారంభ ధర కేవలం రూ.3.5 లక్షల శ్రేణిలో ఉంది.

ప్రస్తుతం మారుతి ఆల్టో K10 కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.3,69,600 నుంచి మొదలవుతుంది. దీనితో పోలిస్తే మారుతి ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3,49,900 నుంచే ప్రారంభం అవుతోంది. అంటే, దాదాపు రూ.20,000 తక్కువకే ఎస్-ప్రెస్సో దొరుకుతుంది. ఎస్-ప్రెస్సోలో అడ్వాన్స్‌డ్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 49 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా AGS (ఆటో గియర్ షిఫ్ట్) ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు మొత్తం 7 కలర్ వేరియంట్లలో, ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. దీని టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,24,900.

మారుతి ఎస్-ప్రెస్సో ధర తక్కువగా ఉన్నప్పటికీ, సేఫ్టీకి సంబంధించిన మంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయంలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ కూడా ఇచ్చారు. అలాగే కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి వెళ్లకుండా సహాయపడేందుకు హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

మారుతి ఎస్-ప్రెస్సోకు అదే బ్రాండ్‌లో ఆల్టో K10 అతిపెద్ద పోటీదారు. ఆల్టో ధర రూ.3.70 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ బడ్జెట్లో దీనికి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఉంది. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుంచి మొదలై రూ.5.99 లక్షల వరకు ఉంటుంది. అలాగే సేఫ్టీలో మంచి పేరున్న టాటా టియాగో, ఎస్-ప్రెస్సో కంటే కొంచెం ఖరీదైనప్పటికీ రూ.5 లక్షల ధరల శ్రేణిలో మంచి ఎంపిక. టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.57 లక్షల నుంచి మొదలై రూ.7.82 లక్షల వరకు వెళుతుంది

PolitEnt Media

PolitEnt Media

Next Story