Citroen Basalt X: క్రెటా, సెల్టోస్, విటారాలకు గట్టి పోటీ.. సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కార్ వచ్చేసింది
సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కార్ వచ్చేసింది

Citroen Basalt X: సిట్రోయెన్ ఇండియా తన లైన్‌అప్‌ను కొత్త బసాల్ట్ ఎక్స్ వేరియంట్‌తో విస్తరించింది. కొత్త సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధర రూ.12.90 లక్షలు. ఇందులో అనేక పవర్ఫుల్ ఫీచర్లు, స్టైలింగ్ మార్పులు ఉన్నాయి. బసాల్ట్ ఎక్స్ అనేక ఇంజిన్ ఆప్షన్లు, ట్రిమ్ లెవల్లో లభిస్తుంది. కొత్త బసాల్ట్ ఎక్స్‌ను కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో అప్‌డేట్ చేశారు. టాప్ వేరియంట్‌లో కొత్త, ప్రీమియం మెటీరియల్‌తో తయారు చేసిన లైట్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ కొత్త డ్యూయల్-టోన్ థీమ్ ఇచ్చారు. ఈ మోడల్‌లో ఆల్-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పెరిమెట్రిక్ అలారం, కొత్త కారా ఇన్-కార్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కారాలో వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది. దీనితో నావిగేషన్, సర్వీస్ హిస్టరీ, రూట్ సెలెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటరెస్ట్ వంటి పనులను ఈజీ చేయవచ్చు. సిట్రోయెన్ తమ డీలర్ నెట్‌వర్క్‌ను త్వరలో 88 నుంచి 150కి పెంచే యోచనలో ఉన్నట్లు కూడా ప్రకటించింది.
బసాల్ట్ ఎక్స్, యూ వేరియంట్‌లో 1.2 పెట్రోల్ ఇంజిన్ ఉంది. దాని ధర రూ.7.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్లస్ వేరియంట్‌లో 1.2 పెట్రోల్ ఇంజిన్, 1.2 పెట్రోల్ టర్బో ఇంజిన్ ఆప్షన్ ఉంది. వాటి ధరలు రూ.9.42 లక్షలు, రూ.10.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ టాప్-స్పెక్ మ్యాక్స్ ప్లస్ వేరియంట్ 1.2 పెట్రోల్ టర్బో ఇంజిన్ ఆప్షన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లలో వస్తుంది. దాని ధరలు రూ.11.62 లక్షలు, రూ.12.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
కొత్త సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, డ్యాష్‌బోర్డ్‌పై లెదర్ ఫినిష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో కీలెస్ ఎంట్రీ, ఒక ఐచ్ఛిక 360-డిగ్రీ కెమెరా, కొత్త గార్నెట్ రెడ్ ఎక్స్‌టీరియర్ షేడ్ కూడా లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్న 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారు క్రెటా, సెల్టోస్, విటారాతో పోటీపడుతుంది.
ఇందులో 7-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈఎస్‌పీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్‌లో 1.2-లీటర్, మూడు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 108 బీహెచ్‌పీ, 190 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఇది 205 ఎన్‌ఎం వరకు ఉంటుంది.
