ధర, ఫీచర్లు ఇవే

Citroen C3X : మార్కెట్లో బాగా అమ్ముడవుతున్న టాటా పంచ్, రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిట్రోయెన్ సంస్థ భారతదేశంలో తమ సరికొత్త C3X SUVని లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.7.91 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త కారు ద్వారా భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచుకోవాలని సిట్రోయెన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్టాండర్డ్ సిట్రోయెన్ C3 కారు ఆధారంగా రూపొందించినా, ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు, మెరుగైన సౌకర్యాలు అందించారు.

సిట్రోయెన్ C3X కారు ధరలు దాని వేరియంట్‌లను బట్టి మారుతుంటాయి. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే నాచురల్లీ ఎస్పిరేటెడ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.91 లక్షలు కాగా, టర్బో ఆటోమ్యాటిక్ వేరియంట్ ధర రూ. 9.89 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్. కస్టమర్లు కొన్ని వేరియంట్‌లలో కావాలనుకుంటే అదనపు ధర చెల్లించి HALO 360 డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2025 మొదటి వారంలో దీని డెలివరీలను ప్రారంభించనున్నారు. ఈ కారు హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్ వంటి ఇతర కార్లకు కూడా పోటీ ఇవ్వనుంది.

కొత్త సిట్రోయెన్ C3X SUV రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది, 1.2-లీటర్ ప్యూర్‌టెక్ 82 నాచురల్లీ ఎస్పిరేటెడ్ ఇంజిన్, ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెండవది, 1.2-లీటర్ ప్యూర్‌టెక్ 110 టర్బోచార్జ్డ్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టర్బో వేరియంట్ కేవలం 10 సెకండ్లలోపే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఈ కారు 19.3 కిలోమీటర్ల వరకు లీటర్ మైలేజ్‌ను అందిస్తుంది.

భారతీయ రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిట్రోయెన్ అడ్వాన్స్ కంఫర్ట్ సస్పెన్షన్‌తో ఈ కొత్త ఎస్యూవీ వస్తుంది. దీనివల్ల కారులో ప్రయాణం చాలా స్మూతుగా ఉంటుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), హై-స్పీడ్ అలర్ట్, పెరిమెట్రిక్ అలారం వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

సాధారణ C3 కారుతో పోలిస్తే, C3Xలో 15 కొత్త ఫీచర్లు యాడ్ చేశారు. ఇందులో ప్రోక్సీ సెన్స్ పాసివ్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ సిస్టమ్, హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, HALO 360 డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్‌లు, LED DRLs, LED ఇంటీరియర్ లైటింగ్ ఉన్నాయి. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్, 315 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story