అర్బన్ క్రూజర్ హైరైడర్ ఏరో ఎడిషన్ లాంచ్

Toyota : దీపావళి పండుగ సందర్భంగా భారతీయ వినియోగదారులకు టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక అద్భుతమైన బహుమతిని అందించింది. కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ అర్బన్ క్రూజర్ హైరైడర్ కొత్త ఏరో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజీ, ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. లగ్జరీ, కంఫర్ట్, మోడర్న్ డిజైన్ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోరుకునే కస్టమర్‌ల కోసం టయోటా ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.

కొత్త ఏరో ఎడిషన్, అర్బన్ క్రూజర్ హైరైడర్ రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతుంది. ఈ ఎడిషన్‌లో కంపెనీ అనేక డిజైన్ మార్పులు చేసింది. దీనివల్ల ఎస్‌యూవీ గతంలో కంటే మరింత స్పోర్టీ, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. కారుకు షార్ప్, బోల్డ్ లుక్‌ను ఇచ్చే కొత్త స్పాయిలర్ ముందు యాడ్ చేసింది. ఇది కారు ఏరోడైనమిక్ లుక్‌ను మెరుగుపరచడమే కాకుండా రోడ్డుపై మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ లుక్‌ను ఇచ్చే కొత్త రియర్ స్పాయిలర్ అమర్చింది. ఇది స్టైల్‌తో పాటు పర్ఫార్మెన్స్‌ను కూడా మెరుగుపరుస్తుంది. కొత్త డిజైన్‌తో కూడిన సైడ్ స్కర్ట్‌లు ఎస్‌యూవీకి లో-స్లంగ్, పర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ లుక్‌ను ఇస్తాయి. తద్వారా కారు మొత్తం మరింత డైనమిక్‌గా కనిపిస్తుంది.

టయోటా హైరైడర్ ఏరో ఎడిషన్‌ను నాలుగు ఆకర్షణీయమైన కలర్లలో లాంచ్ చేసింది. వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్. కంపెనీ దీనితో పాటు ఒక ఎక్స్‌క్లూజివ్ స్టైలింగ్ ప్యాకేజీని కూడా పరిచయం చేసింది. దీని ధర రూ.31,999 గా నిర్ణయించింది. ఈ యాక్సెసరీ ప్యాకేజీ అన్ని అధీకృత టయోటా డీలర్‌షిప్‌లలో సులభంగా లభిస్తుంది. అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధరతో ఈ ఎస్‌యూవీ తన సెగ్మెంట్‌లో ఒక చవకైన, ప్రీమియం ఆప్షన్‎గా నిలుస్తుంది.

లాంచ్ అయినప్పటి నుండి టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు భారతీయ వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. 2022లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి ఈ ఎస్‌యూవీ ఇప్పటివరకు 1.68 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. హైరైడర్ టయోటా గ్లోబల్ ఎస్‌యూవీ లైనప్ నుండి ప్రేరణ పొందింది. దాని ప్రీమియం డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీ, హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా భారతీయ కస్టమర్‌లలో చాలా ప్రాచుర్యం పొందింది. ఏరో ఎడిషన్ రాకతో ఈ ఎస్‌యూవీకి ఉన్న ఆకర్షణ మరింత పెరిగింది.

టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఏరో ఎడిషన్ దాని ఎక్స్‌క్లూజివ్ స్టైలింగ్, అప్‌డేటెడ్ డిజైన్ కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. కొత్త ఫ్రంట్, రియర్ స్పాయిలర్లు, సైడ్ స్కర్ట్‌లు, ప్రీమియం కలర్ ఆప్షన్స్‌తో ఈ ఎస్‌యూవీకి ఒక పర్సనలైజ్డ్, ఎక్స్‌క్లూజివ్ టచ్ లభిస్తుంది. రూ.31,999 విలువైన యాక్సెసరీ కిట్‌తో, ఈ ఎస్‌యూవీ చూడటానికి మాత్రమే కాదు పర్ఫామెన్స్ పరంగా కూడా బెస్ట్ అని చెప్పొచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story