Diwali Offers: దీపావళి ధమాకా ఆఫర్లు.. ఈ 5 ఎస్‌యూవీ కార్లపై రూ.90,000 వరకు భారీ డిస్కౌంట్లు
రూ.90,000 వరకు భారీ డిస్కౌంట్లు

Diwali Offers: దీపావళి పండుగ వేళ కొత్త ఎస్‌యూవీ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు స్కోడా, టాటా, నిస్సాన్, రెనాల్ట్, కియా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో రూ.55,000 నుంచి ఏకంగా రూ.90,000 వరకు ఆదా చేసుకునే అద్భుతమైన ఆఫర్ ఈ పండుగ సీజన్‌లో కల్పిస్తున్నాయి. ఈ ఐదు ప్రముఖ ఎస్‌యూవీ మోడళ్లపై అందుబాటులో ఉన్న పూర్తి ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
స్కోడా కైలాక్
ఈ పండుగ సేల్‌లో అత్యధిక తగ్గింపు ఇస్తున్న కార్లలో స్కోడా కైలాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్లు ఏకంగా రూ.90,000 వరకు లబ్ధి పొందవచ్చు. ఇందులో రూ.40,000 వరకు డీలర్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. దీనికి అదనంగా అర్హులైన కస్టమర్లకు కార్పొరేట్ లేదా లాయల్టీ స్కీమ్ కింద మరో రూ.20,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.60 లక్షల నుంచి రూ.13.10 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాటా నెక్సాన్ కొనుగోలుపై కూడా దీపావళి వేళ ఊరట లభిస్తోంది. నెక్సాన్ ఎంపిక చేసిన టర్బో-పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.75,000 వరకు ప్రయోజనాలు అందుతున్నాయి. దీనిలో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.45,000 ఇంటర్వెన్షన్ స్కీమ్, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అలాగే నెక్సాన్ సీఎన్‌జీ మోడల్‌పై రూ.60,000, సాధారణ పెట్రోల్ వేరియంట్లపై రూ.55,000, డీజిల్ మోడల్‌పై రూ.20,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు.
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌పై కొనుగోలుదారులు రూ.72,000 వరకు పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా విజియా ఎంటీ వేరియంట్‌పై గరిష్ట డిస్కౌంట్ లభిస్తుండగా, టర్బో-పెట్రోల్ మాన్యువల్, సివిటీ వేరియంట్లపై రూ.71,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. నాన్-టర్బో మాన్యువల్ మోడళ్లపై రూ.42,000 నుంచి రూ.70,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.69 లక్షల నుంచి రూ.10.99 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ కైగర్ & కియా సిరోస్ ఆఫర్లు
రెనాల్ట్ కైగర్ 2026 మోడల్ వేరియంట్లపై మొత్తం రూ.65,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఎవల్యూషన్+, టెక్నో, ఎమోషన్ వేరియంట్లపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ అందిస్తున్నారు. ఇక కియా కంపెనీ తీసుకొచ్చిన 'సిరోస్' ఎస్‌యూవీపై రూ.55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. దీనితో పాటు కియా సంస్థ పరిమిత కాలం వరకు ఉచితంగా ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది.

