Car Discount : రూ.10 లక్షల వరకు భారీ తగ్గింపు.. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు
ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు

Car Discount : ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ఇది మంచి సమయం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ఆగస్టు నెలలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే ఈ బంపర్ ఆఫర్లను అస్సలు మిస్ చేసుకోవద్దు.
ఆగస్టులో అత్యధిక తగ్గింపు ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు
1. కియా ఈవీ6
ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారుపై ప్రస్తుతం అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ ఏకంగా రూ.10 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇటీవల కొత్తగా విడుదలైన ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎక్కువ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
2. మహీంద్రా ఎక్స్‌యూవీ400
మహీంద్రా ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ ఉంది. దీనిపై రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. మంచి ఫీచర్లు, డిజైన్‌తో ఈ కారు మార్కెట్లో మంచి పోటీనిస్తోంది.
3. ఎంజీ జెడ్ఎస్ ఈవీ
ఎంజీ మోటార్స్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారుపై ఈ నెలలో రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల దూరం సులభంగా ప్రయాణించగలదు. స్టైలిష్ లుక్‌తో పాటు, ఎక్కువ రేంజ్ కోసం ఈ కారును ఎంచుకోవచ్చు.
4. సిట్రాన్ ఈసీ3
సిట్రాన్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుపై కూడా మంచి డిస్కౌంట్ ఇస్తోంది. ఈ నెలలో ఈ కారు కొంటే రూ.1.25 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 246 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. తక్కువ ధరలో ఒక మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ కారు కావాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.
5. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కారుపై ఈ ఆగస్టు నెలలో రూ.1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. ఎక్కువ మంది ఇష్టపడే డిజైన్, బ్రాండ్ వాల్యూ ఉన్న కారు కొనాలనుకుంటే దీనిని పరిశీలించవచ్చు.
