2026లో మహీంద్రా నుంచి రెండు కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు

Mahindra : భారత మార్కెట్‌లో ఎస్‌యూవీల విభాగానికి రాజుగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా, రాబోయే రోజుల్లో మరో రెండు పవర్ఫుల్ 7-సీటర్ ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఒకటి మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 ఫేస్‌లిఫ్ట్ కాగా, మరొకటి అదే డిజైన్‌తో కూడిన ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా XEV 7e. ఈ రెండు కార్లు 2026 ప్రారంభంలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా తమ అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 మోడల్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు, దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా భారత మార్కెట్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది. 2026 ప్రారంభంలో మహీంద్రా స్కార్పియో ఎన్, XUV700 ఎస్‌యూవీలకు ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా, మహీంద్రా XEV 9e మూడు-వరుసల సీటింగ్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయనుంది. దీనికి మహీంద్రా XEV 7e అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ XEV 7e, XEV 9e, ICE XUV700 డిజైన్‌ను పంచుకుంటుంది.

రాబోయే XUV700 ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ మార్పులతో పాటు అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లను యాడ్ చేయనున్నారు. కొత్త డిజైన్ గ్రిల్, కొత్త ట్విన్ బారెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ సిగ్నేచర్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో అతిపెద్ద మార్పు ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఇది XEV 9e నుంచి తీసుకున్నారు. దీంతో పాటు హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉండే అవకాశం ఉంది.

XUV700 ఫేస్‌లిఫ్ట్‌లో కూడా పాత ఇంజినే కొనసాగవచ్చు. అవి: 197 బిహెచ్‌పీ, 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 185 బిహెచ్‌పీ, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు (6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్) మారకుండా ఉంటాయి. సెలక్ట్ చేసిన వేరియంట్‌లలో ఏడబ్ల్యుడి సిస్టమ్ కూడా లభిస్తుంది. XEV 7e అనేది XUV700 డిజైన్ స్ఫూర్తితో పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌గా రాబోతోంది.

లీకైన ఫోటోల ప్రకారం XEV 7e చాలా వరకు XEV 9e ని పోలి ఉంటుంది. ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉంటాయి. కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ మినహా సైడ్, వెనుక భాగం XUV700 లాగే కనిపిస్తుంది. ఇది మూడు-వరుసల సీటింగ్ తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 16-స్పీకర్ హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. దీని పవర్‌ట్రైన్ సెటప్ కూడా XEV 9e నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇది 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story