Yezdi Adventure : హిమాలయన్ కు గట్టి పోటీ..రెండు హెడ్ ల్యాంపులతో సరికొత్త యెజ్డి అడ్వెంచర్ 2025
సరికొత్త యెజ్డి అడ్వెంచర్ 2025

Yezdi Adventure : అడ్వంచర్ బైక్ పట్ల ఆసక్తికల వారికోసం ఇప్పుడు భారత మార్కెట్లో యెజ్డి అడ్వెంచర్ (Yezdi Adventure) 2025 మోడల్ వచ్చేసింది. దీని గత మోడల్ కంటే దీని ధర కేవలం రూ.6,000 మాత్రమే ఎక్కువ. కానీ, ఇందులో చాలా ఎక్కువ ఫీచర్లు అందించారు. ఈ బైక్‌లో ముఖ్యంగా ఒక హెడ్‌ల్యాంప్ బదులు రెండు హెడ్‌ల్యాంప్‌లు, రెండు టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. యెజ్డి అడ్వెంచర్ 2025 ఇప్పుడు విడుదలైంది. మార్కెట్‌లో ఇది నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ తో పోటీపడుతుంది.
ఈ బైక్‌లో రెండు హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది వాస్తవానికి ఒక రెండు లైట్ల ఏర్పాటు. ఇందులో ఒక లైట్ సాధారణ డిమ్‌లైట్ లాగా పనిచేస్తుంది. కాగా రెండవ లైట్ ఒక ప్రొజెక్టర్ లైట్. ఇది చీకటి లేదా దట్టమైన దారుల్లో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. అంతేకాదు, పొగమంచులో లేదా దుమ్ము ధూళిలో కూడా మీకు మంచి విజిబిలిటీని ఇస్తుంది. హెడ్‌ల్యాంప్‌ల వలె వెనుక టెయిల్ ల్యాంప్‌లకు కూడా కంపెనీ రెండు లైట్ల అవకాశాన్ని ఇస్తోంది. ఈ ఒక్క ఫీచర్ ఈ బైక్ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
పాత మోడల్ తో పోలిస్తే కొత్త బైక్ లో రెండు లైట్ల సిస్టమ్ ఉంటుంది. అంతేకాకుండా, కేవలం రూ.6,000 అదనంగా చెల్లిస్తే ఈ బైక్‌లో కొత్త డిజైన్‌తో కూడిన వైజర్, బైక్ పీక్, వెనుక భాగాన్ని మార్చారు. ఇందులో మరిన్ని ఫీచర్లు కూడా జోడించారు. యెజ్డి అడ్వెంచర్ 2025లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఈ విభాగంలో మొదటిసారిగా వచ్చాయి. ఇందులో అధునాతన ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఈ బైక్ 3 ఏబీఎస్ మోడ్స్ లో లభిస్తుంది – అవి: రోడ్ (Road), వర్షం (Rain), ఆఫ్-రోడ్ (Off-Road). ఈ మోడ్స్ వివిధ ప్రాంతాలలో మెరుగైన బ్రేకింగ్, నడిపే సౌలభ్యాన్ని (Handling) అందిస్తాయి.
ఈ బైక్‌లో కంపెనీ 334 సీసీ ఆల్ఫా2 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ను అందించింది. ఇది 29.6 పీఎస్ (PS) పవర్, 29.9 ఎన్ఎమ్ (Nm) టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. జావా యెజ్డి మోటార్‌సైకిల్స్ ఈ బైక్‌తో పాటు 'జావా యెజ్డి బీఎస్‌ఏ ఓనర్‌షిప్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్' ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని కింద నాలుగేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా, ఆరు సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ (Extended Warranty) ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ బైక్ అడ్వెంచర్ రైడర్లకు ఒక ఎట్రాక్టివ్ ఆప్షన్ గా నిలుస్తుంది.
