Ducati Monster Offer : డుకాటి మాన్‌స్టర్‌పై బంపర్ ఆఫర్.. ఫ్రీ వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్
ఫ్రీ వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్

Ducati Monster Offer : డుకాటీ ఇండియా తమ ఐకానిక్ నేకెడ్ బైక్ మాన్‌స్టర్‌పై ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ బైక్ కొన్నవారికి రెండేళ్ల అదనపు వారంటీ, రెండేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉచితంగా లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్ ఆగస్టు 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందాలంటే కేవలం ఈ రోజు వరకు మాత్రమే సమయం ఉంది. డుకాటీ మాన్‌స్టర్ భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ. 12.95 లక్షలు, ప్లస్ మోడల్ ధర రూ. 13.15 లక్షలు, ఎస్‌పీ మోడల్ ధర రూ. 15.95 లక్షలు. ఈ మూడు వేరియంట్లు వేర్వేరు డిజైన్, పెర్ఫార్మెన్స్ స్థాయిలకు అనుగుణంగా తయారు చేశారు.
కొత్త డుకాటీ మాన్‌స్టర్‌లో పవర్ఫుల్ 937సీసీ, టెస్టాస్ట్రెట్టా ఎల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 111 బీహెచ్‌పీ పవర్, 93 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, యాంటీ-స్లిప్ క్లచ్, క్విక్‌షిఫ్టర్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వస్తాయి. డుకాటీ మాన్‌స్టర్‌లో ఫుల్-ఎల్ఈడీ లైటింగ్, 4.3 అంగుళాల బ్లూటూత్-ఎనేబుల్డ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు - స్పోర్ట్, అర్బన్, టూరింగ్ ఉన్నాయి. వీటితో పాటు వీల్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, లాంచ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
సాధారణంగా ఎక్స్ ట్రా వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం అదనంగా డబ్బు చెల్లించాలి. కానీ ఈ ఆఫర్ కింద డుకాటీ తన కస్టమర్లకు మొత్తం నాలుగు సంవత్సరాల భద్రత , సౌలభ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వల్ల కస్టమర్లకు డబ్బు ఆదా అవుతుంది. బైక్ పట్ల భద్రత పెరుగుతుంది.
