క్యాబ్ వ్యాపారానికి బెస్ట్ 4 కార్లు ఇవే

Cab Cars : మీరు ఓలా, ఊబర్, రాపిడో వంటి క్యాబ్ సర్వీసులలో కొత్త కారు కొనుగోలు చేసి, తద్వారా నెలకు మంచి ఆదాయం సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే, అందుకు తగిన కారు సెలక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. క్యాబ్ వ్యాపారంలో ఎక్కువ లాభం పొందాలంటే, కారు తక్కువ ఇంధనాన్ని వినియోగించాలి, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత ధరలు మరింత చౌకగా మారిన కొన్ని బెస్ట్ కార్లు మీకు ఉపయోగపడతాయి. మారుతి డిజైర్ టూర్ ఎస్, మారుతి వాగన్ ఆర్, హ్యుందాయ్ ఆరా, మారుతి ఎర్టిగా వంటి కార్లు క్యాబ్ ఫ్లీట్‌కు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు.

మారుతి వాగన్ ఆర్

తక్కువ బడ్జెట్‌లో నగరంలో టాక్సీ లేదా లోకల్ రైడ్ సర్వీస్ ప్రారంభించాలనుకునే వారికి మారుతి వాగన్ ఆర్ మంచి ఎంపిక. దీని ధర రూ.4.98 లక్షల నుండి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్‌పై లీటరుకు 25 కి.మీ, సీఎన్‌జీ పై కిలోకు 34.05 కి.మీ మైలేజ్ ఇస్తుంది. AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

మారుతి డిజైర్ టూర్ ఎస్

మారుతి డిజైర్ టూర్ ఎస్ లో మెయింటెనెన్స్ ఖర్చు, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, అద్భుతమైన మైలేజ్‌కు ప్రసిద్ధి చెందింది. క్యాబ్ సర్వీసులకు ఇది చాలా పాపులారిటీ పొందిన సెడాన్. దీని ధర రూ.6.24 లక్షల నుండి రూ.7.74 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్). 1.2-లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది పెట్రోల్‌పై 26.06 కి.మీ/లీ, సీఎన్‌జీపై 34 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.

హ్యుందాయ్ ఆరా

తమ క్యాబ్ ఫ్లీట్‌కు కొంచెం ప్రీమియం లుక్ ఇవ్వాలనుకునే డ్రైవర్లకు హ్యుందాయ్ ఆరా స్టైల్, కంఫర్ట్, ఫ్యూయెల్ ఎఫీషియన్సీల అద్భుతమైన కలయికను అందిస్తుంది. దీని ధర రూ.5.98 లక్షల నుండి రూ.8.24 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్‌పై 24.7 కి.మీ/లీ, సీఎన్‌జీపై 28 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.

మారుతి ఎర్టిగా

భారతదేశంలోని టాక్సీ ఫ్లీట్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ ఎంపీవీ మారుతి ఎర్టిగా. అవుట్‌స్టేషన్ ట్రిప్స్, గ్రూప్ రైడ్స్, కుటుంబ ప్రయాణాల కోసం ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.8.80 లక్షల నుండి రూ.12.94 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్‌పై 20.51 కి.మీ/లీ, సీఎన్‌జీపై 26.11 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. 360° కెమెరా, థర్డ్-రో ఏసీ వెంట్స్, LED హెడ్‌ల్యాంప్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story