టాటా హారియర్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ

EV Comparison : ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు (ఈవీలు) చాలా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా హారియర్ ఈవీని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది ఇప్పటికే ఉన్న మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు కార్ల మధ్య తేడాలు, వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

టాటా హారియర్ ఈవీ

టాటా హారియర్ ఈవీ రెండు రకాల బ్యాటరీలతో వస్తుంది. ఒకటి 65kWh, మరొకటి 75kWh. 75kWh బ్యాటరీ మోడల్ అయితే, రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ రెండు రకాల్లో లభిస్తుంది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం, ఈ 75kWh మోడల్ కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇది చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని అర్థం. పూర్తి ఛార్జ్ చేస్తే, AWD మోడల్ 622 కిలోమీటర్ల వరకు, RWD మోడల్ 627 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే, మనం రోడ్డుపై మామూలుగా నడిపేటప్పుడు RWD మోడల్ సుమారు 480 నుండి 505 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ కార్లలో అడ్వాన్స్‌డ్ ఈ-వాలెట్ సిస్టమ్ (డిజిటల్‌గా చెల్లింపులు), ఆటో పార్కింగ్ అసిస్ట్, 540 డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఇన్-బిల్ట్ డ్యాష్‌క్యామ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ కూడా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. 59kWh బ్యాటరీ మోడల్ పూర్తి ఛార్జ్‌పై 542 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇంకా పెద్ద బ్యాటరీ అయిన 79kWh మోడల్, పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 656 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించగలదు. ఈ కారులో 16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ (సినిమా హాళ్లలో ఉండే సౌండ్ అనుభవం) వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ధరల్లో తేడాలు

టాటా హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, అన్ని మోడళ్ల ధరలు ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ ధర రూ.22.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ.31.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ రెండు కార్ల మధ్య ధరలో కొంచెం తేడా ఉంది. బడ్జెట్, ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు. ఏ ఫీచర్లు ముఖ్యమో అనే వాటిని బట్టి ఈ రెండింటిలో ఒక కారును ఎంచుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story