ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Tesla : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా, డ్రైవర్ లేకుండా నడిచే కార్లను తయారు చేయడంలో ముందంజలో ఉంది. తాజాగా టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో డ్రైవర్లు టెక్స్ట్ అండ్ డ్రైవ్ చేసేందుకు అనుమతినిస్తున్న కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు కేవలం కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు లేదా నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫీచర్ సేఫ్టీకి ముప్పు కలిగించవచ్చని తెలిసినా, ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించడం కార్ల మార్కెట్‌లో చర్చకు దారితీసింది.

టెస్లాకోనోమిక్స్ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి FSD v14.2.1 లో నేను టెక్స్ట్ అండ్ డ్రైవ్ చేయవచ్చా? అనే ప్రశ్న వచ్చింది. దానికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, "అవును, కానీ అది మీ చుట్టూ ఉన్న ట్రాఫిక్ సందర్భంపై ఆధారపడి ఉంటుంది" అని సమాధానం ఇచ్చారు. టెస్లా డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కారులోని కెమెరా ద్వారా డ్రైవర్ కళ్లపై నిఘా ఉంచుతుంది. డ్రైవర్ ఎక్కువసేపు కిందకు (ఫోన్‌ను) చూస్తుంటే, డ్రైవర్ దృష్టిని మరల్చకుండా ఉండేందుకు కారు హెచ్చరిక ఇస్తుంది. ఇలా ఐదుసార్లు హెచ్చరించిన తర్వాత, FSD ఫీచర్ ఆగిపోయి, డ్రైవరే కారు స్టీరింగ్‌ను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త ఫీచర్ ఉద్దేశం ఏమిటి?

ఎలాన్ మస్క్ ప్రకారం.. ఈ మానిటరింగ్ సిస్టమ్ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో డ్రైవర్‌ను అటూ ఇటూ చూసేందుకు అనుమతిస్తుంది. ఉదాహరణకు.. కారు రెడ్ లైట్ వద్ద లేదా ట్రాఫిక్‌లో నిలిచిపోయినప్పుడు, డ్రైవర్ వేరేవైపు చూడటం సురక్షితమని ఈ మానిటరింగ్ సిస్టమ్ భావిస్తుంది. అందుకే టెస్లా ఈ టెక్స్ట్ అండ్ డ్రైవ్ ఫీచర్‌ను ట్రాఫిక్ సందర్భాన్ని బట్టి అనుమతిస్తోంది. కాగా ఈ ఫీచర్ ప్రస్తుతానికి భారతదేశంలో అందుబాటులో ఉన్న టెస్లా మోడళ్లలో చేర్చబడలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story