గేమ్‌ ఛేంజ్ పక్కా

New Electric SUVs : రాబోయే నెలలు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ మయం కానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అగ్రగామి కంపెనీలైన మారుతి, మహీంద్రా, టాటా నుంచి ఏకంగా నాలుగు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు కార్లు మార్కెట్‌లో పెను మార్పులు తీసుకురావడం ఖాయం. మారుతి ఇ-విటారా ధరలను డిసెంబర్ 2న ప్రకటిస్తారు. మహీంద్రా రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు నవంబర్ 26, 2025 న లాంచ్ అవుతాయి. ఇక టాటా సియెర్రా ఈవీ 2026 ప్రారంభంలో వస్తుంది. ఈ నాలుగు మోడళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. మారుతి ఇ-విటారా

భారత మార్కెట్లో మారుతి నుంచి వస్తున్న తొలి ప్రధాన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 49kWh, 61kWh. సింగిల్ ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ మోటార్ స్టాండర్డ్‌గా ఉంటుంది. పెద్ద 61kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే డ్యూయల్ మోటార్, AWD (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ ధృవీకరించింది. లెవెల్ 2 ADAS, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్లు, ట్విన్-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, సింగిల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

2. మహీంద్రా XEV 9S

మహీంద్రా నుంచి వస్తున్న ఈ మోడల్ XUV700 త్రీ-రోల (7-సీటర్) ఎలక్ట్రిక్ వెర్షన్. దీని డిజైన్ ఎలిమెంట్స్, ఫీచర్లు, విడిభాగాలు XEV 9e మోడల్‌ను పోలి ఉంటాయి. కొత్త టీజర్ల ప్రకారం ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో బాస్ మోడ్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులకు ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉండవచ్చు. పవర్‌ట్రైన్ కూడా XEV 9e నుంచే తీసుకుంటారు.

3. మహీంద్రా BE Rall-E

ఇది మహీంద్రా BE సిరీస్ నుంచి వస్తున్న ఆఫ్‌రోడింగ్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని ప్రొడక్షన్ వెర్షన్ నవంబర్ 26, 2025న బెంగళూరులో ప్రదర్శించబడుతుంది. దీని డిజైన్ కాన్సెప్ట్ మోడల్‌కు దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. ఇది ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. టీజర్లలో స్టార్-ప్యాటర్న్ ఉన్న అల్లాయ్ వీల్స్, LED లైట్ బార్, సర్కులర్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో BE 6 పవర్‌ట్రైన్ సెటప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

4. టాటా సియెర్రా ఈవీ

టాటా లెజెండరీ సియెర్రా మళ్లీ ఎలక్ట్రిక్ రూపంలో రాబోతోంది. హారియర్ ఈవీ నుంచి తీసుకున్న 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇందులో లభించే అవకాశం ఉంది. సియెర్రా ఈవీ కూడా 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వనుంది. AWD లేదా QWD (క్వాడ్-వీల్ డ్రైవ్) ఆప్షన్ ఉన్నత శ్రేణి వేరియంట్‌లలో లభించే అవకాశం ఉంది. కొన్ని ఈవీ డిజైన్ అంశాలు మినహా సియెర్రా ఈవీ తన ఐసీఈ వెర్షన్ లాగే కనిపిస్తుంది. ఇంటీరియర్, ఫీచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story