బేస్ వేరియంట్‌లో ఏ ఫీచర్లు మిస్సయ్యాయి?

Tata Sierra : టాటా మోటార్స్ కొత్త ఎస్‌యూవీ అయిన సియెర్రా సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో మరోసారి రోడ్లపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తుంటే దీనిలోని బేస్ (Smart+), టాప్ (Accomplished+) వేరియంట్‌ల మధ్య ఫీచర్లలో ఎంత తేడా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కొనుగోలుదారుల కోసం స్మార్ట్+ వేరియంట్‌లో అన్ని అవసరమైన ఫీచర్లు అందించగా, అకంప్లిష్డ్‌+ వేరియంట్‌లో సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వస్తున్న టెక్నాలజీ, ప్రీమియం సౌకర్యాలు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు వేరియంట్‌లలో ఏది ఎంచుకోవాలి? వాటిలోని ఫీచర్లను ఒకసారి పోల్చి చూద్దాం.

బేస్ వేరియంట్ (Smart+)

స్మార్ట్+ బేస్ వేరియంట్‌లో కొన్ని అద్భుతమైన, ఊహించని ఫీచర్లు ఉన్నాయి. అయితే, కొన్ని టెక్నాలజీ ఫీచర్లు మిస్ అయ్యాయి. ఈ బేస్ వేరియంట్ డాష్‌బోర్డ్ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో డ్రైవర్ కోసం 4-అంగుళాల డిజిటల్ యూనిట్ తప్ప వేరే స్క్రీన్ ఏదీ ఉండదు. అయినప్పటికీ, 4 పవర్ విండోస్, టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, రియర్ ఏసీ వెంట్స్, స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఎక్స్‌టెండబుల్ సన్ వైజర్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ORVMలు, ఆటో ఏసీ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు లభిస్తాయి. కానీ, కీ-లెస్ ఎంట్రీతో కూడిన పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్‌లు (టైప్-A, C), రియర్ విండో సన్‌షేడ్ వంటి ఫీచర్లు ఈ బేస్ వేరియంట్‌లో అందుబాటులో లేవు.

టాప్ వేరియంట్ (Accomplished+)

అకంప్లిష్డ్‌+ టాప్ వేరియంట్‌లో ఫీచర్లకు కొదవే లేదు. ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు స్క్రీన్‌లు లభిస్తాయి. మూడవ స్క్రీన్‌లో ఆర్కేడ్ యాప్ సూట్ ఉంటుంది, దీని ద్వారా యాప్‌లు, గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, షోలను చూడవచ్చు. వీటితో పాటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమొరీ ఫంక్షన్ ఉన్న పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందించారు.

ఇంజిన్ పోలిక

ఇంజిన్ విషయానికి వస్తే కూడా రెండు వేరియంట్‌లలో తేడా ఉంది. బేస్ వేరియంట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. అయితే కొత్త, మరింత పవర్‌ఫుల్ అయిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కేవలం అడ్వెంచర్+ నుంచి మొదలయ్యే హయ్యర్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. టాప్ వేరియంట్‌లో డీజిల్ మాన్యువల్, డీజిల్ ఆటోమేటిక్, టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story