మెజెస్టర్ ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

MG Majestor 2026: జీ మోటార్ ఇండియా తన సరికొత్త భారీ ఎస్‌యూవీ మెజెస్టర్‎తో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో భూకంపం సృష్టించడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ కానున్న ఈ కారు, అంతర్జాతీయ మార్కెట్లో పాపులర్ అయిన Maxus D90 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించబడింది. ఆటో ఎక్స్‌పో 2025లో తొలిసారిగా ప్రదర్శించినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైజు పరంగా చూస్తే, ఇది 5,046 మిమీ పొడవు, 2,016 మిమీ వెడల్పు, 1,876 మిమీ ఎత్తును కలిగి ఉంది. అంటే ఇది టయోటా ఫార్చ్యూనర్ కంటే అన్ని విధాలా పెద్దది. దీని 2,950 మిమీ వీల్‌బేస్ కారు లోపల రాజభవనం లాంటి స్థలాన్ని అందిస్తుంది.

డిజైన్, లుక్స్: మెజెస్టర్ లుక్ చూస్తేనే ఇది ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతుంది. ముందు భాగంలో భారీ గ్లోస్-బ్లాక్ గ్రిల్, దానికి ఇరువైపులా స్టైలిష్ ఎల్ఈడీ లైట్లు కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. సైడ్ నుండి చూస్తే 20-అంగుళాల భారీ డైమండ్-కట్ అలాయ్ వీల్స్, ఎక్కడానికి సులభంగా ఉండే సైడ్ స్టెప్స్ దీనికి రగ్డ్ లుక్‌ను తెచ్చాయి. వెనుక వైపు ర్యాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషింగ్ ఈ ఎస్‌యూవీని ఒక కంప్లీట్ మాన్స్టర్ లాగా చూపిస్తాయి.

ఫీచర్లు, లగ్జరీ: లోపలికి అడుగుపెడితే ఇది ఒక లగ్జరీ హోటల్ గదిని తలపిస్తుంది. ఆల్-బ్లాక్ ప్రీమియం క్యాబిన్‌లో రెండు 12.3 అంగుళాల భారీ స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్-2 ADAS టెక్నాలజీని అందించారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి 20కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్, పర్ఫార్మెన్స్: ఎంజీ మెజెస్టర్ ఇంజిన్ పరంగా కూడా చాలా పవర్‌ఫుల్. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ రెండు వేరియంట్లలో రానుంది. సింగిల్-టర్బో వెర్షన్ 158.7 bhp పవర్ ఇస్తుండగా, ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఏకంగా 212.5 bhp పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి. సాధారణ రోడ్ల కోసం రియర్-వీల్ డ్రైవ్, ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. మార్కెట్లోకి వచ్చాక ఇది టయోటా ఫార్చ్యూనర్ మాత్రమే కాకుండా స్కోడా కొడియాక్ , రాబోయే ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story