Yamaha FZ-Rave : యమహా FZ-Rave లాంచ్.. టీవీఎస్ అపాచే RTR 160 కి గట్టి పోటీ!
టీవీఎస్ అపాచే RTR 160 కి గట్టి పోటీ

Yamaha FZ-Rave : భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు యమహా సంస్థ, తమ FZ సిరీస్‌లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అదే యమహా FZ-Rave. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.17 లక్షలతో విడుదలైన ఈ బైక్, స్టైల్, రిఫైన్‌మెంట్, బ్యాలెన్స్‌డ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. మార్కెట్‌లో దీని ప్రధాన పోటీదారు టీవీఎస్ అపాచే RTR 160. ఈ రెండు ప్రముఖ 150cc మోటార్‌సైకిళ్ల మధ్య డిజైన్, ఇంజిన్, పెర్ఫార్మెన్స్, ధర పరంగా తేడాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
యమహా FZ-Rave, టీవీఎస్ అపాచే RTR 160 రెండూ తమకంటూ ప్రత్యేకమైన డిజైన్ శైలిని కలిగి ఉన్నాయి. ఈ బైక్‌లో FZ సిరీస్ ట్రేడ్‌మార్క్ అయిన మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, LED హెడ్‌లైట్, క్లీన్ రేర్ ప్రొఫైల్ ఉన్నాయి. ఇది మ్యాట్ టైటాన్, మెటాలిక్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఈ బైక్ స్పోర్టీ గ్రాఫిక్స్, డైనమిక్ ట్యాంక్ కౌల్స్, సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్‌తో రేస్-రెడీ లుక్ కోసం ప్రసిద్ధి చెందింది. సిటీ రైడర్‌ల కంటే స్పోర్టీ లుక్ ఇష్టపడే వారికి అపాచే ఆకర్షణీయంగా ఉంటుంది. రెండు బైక్‌ల మధ్య పనితీరులో స్పష్టమైన తేడా ఉంది.
అపాచే RTR 160 ఇంజిన్ పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల 15.82 hp తో FZ-Rave (12 hp) కంటే ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, FZ-Rave మెరుగైన లో ఎండ్ టార్క్(13.3 Nm) ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్‌లో స్మూత్ యాక్సిలరేషన్, రైడింగ్‌కు ప్రయోజనకరం. FZ-Rave దాని రిఫైన్‌మెంట్, బ్యాలెన్స్‌డ్ హ్యాండ్లింగ్‌కు ప్రశంసలు అందుకుంటుంది. అయితే అపాచే స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కోరుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.
రెండు బైక్‌లలో కూడా ముఖ్యమైన సేఫ్టీ, టెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా FZ-Rave ధర రూ.1.17 లక్షలు. టీవీఎస్ అపాచే RTR 160 2V ధర రూ.1.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెండు బైక్‌లు కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్‌లు, సింగిల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి.
ఏ బైక్ ఎవరికి బెస్ట్?
యమహా FZ-Rave: మీరు స్మూత్ రైడింగ్, ప్రీమియం ఫీల్, సిటీ ట్రాఫిక్‌కు అనుకూలమైన బ్యాలెన్స్‌డ్ హ్యాండ్లింగ్ కోరుకుంటే FZ-Rave బెస్ట్ ఆప్షన్.
టీవీఎస్ అపాచే RTR 160: మీ ప్రాధాన్యత ఎక్కువ పవర్, స్పోర్టీ పెర్ఫార్మెన్స్, రేసింగ్ లుక్ అయితే, అపాచే RTR 160 మరింత మెరుగైన వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది.

