Tata Tiago : టాటా టియాగోపై టాటా మోటార్స్ భారీ ఆఫర్.. ఏకంగా రూ.30వేల డిస్కౌంట్
ఏకంగా రూ.30వేల డిస్కౌంట్

Tata Tiago : మే నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 11 శాతం తగ్గాయి. ఈ కారణంతో టాటా తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. టాటా తన అత్యంత చవకైన రెండు సీఎన్జీ (CNG) సిలిండర్ల కారు టాటా టియాగో (Tata Tiago) పై రూ. 30,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్లో క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. టియాగో iCNG భారత మార్కెట్లో సరసమైన ధర, అధిక సేఫ్టీ, టెక్నాలజీ పరంగా అధునాతనమైన హ్యాచ్‌బ్యాక్ కారుగా గుర్తింపు పొందింది. ఈ కారులో కంపెనీ కొత్త iCNG టెక్నాలజీని ఉపయోగించారు.
టియాగో iCNG లో 1.2 లీటర్, 3-సిలిండర్ రెవోట్రాన్ ఇంజిన్ (Revotron engine) ఉంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 73.4 బిహెచ్పి (bhp) పవర్, 95 ఎన్ఎమ్ (nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ కారు సీఎన్జీ మోడ్‌లో దాదాపు 28 కి.మీ/కిలో మైలేజీని అందిస్తుంది, ఇది దాని సెగ్మెంట్లో అత్యంత ఫ్యూయెల్ కెపాసిటీ గల కార్లలో ఒకటిగా నిలుస్తుంది.
ముఖ్యంగా టాటా టియాగోలో రెండు సీఎన్జీ సిలిండర్లు ఉండటం విశేషం. ఇది ప్రయాణికులకు సామాను పెట్టుకోవడానికి సరిపడా బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది ఇతర సీఎన్జీ కార్లలో అరుదు. భద్రత విషయానికి వస్తే, టాటా టియాగో iCNG కి గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో మైక్రో స్విచ్, లీక్ డిటెక్షన్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, ఫైర్ ప్రొటెక్షన్ డివైజ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి కారులో మంటలు చెలరేగడం వంటి ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
టాటా టియాగో బేస్ మోడల్ ధర రూ. 5లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై, టాప్ మోడల్ ధర సగటున రూ. 8.45 లక్షల వరకు ఉంటుంది. టియాగో iCNG లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు (ORVMs), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఆఫర్ ద్వారా, టాటా టియాగో వినియోగదారులకు మెరుగైన ఎంపికగా నిలుస్తుంది.
