Hyundai : హ్యుందాయ్ కార్లపై రూ.80,000 పైగా డిస్కౌంట్.. జూలై చివరి వరకే ఆఫర్!
జూలై చివరి వరకే ఆఫర్!

Hyundai : కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇదే బెస్ట్ టైం. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ జూలై నెలలో సెలక్ట్ చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ టక్సన్, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి మూడు కార్లపై రూ.80,000కి పైగా తగ్గింపు లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు జూలై 2025 చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
హ్యుందాయ్ కార్లపై లభించే డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ డీజిల్ వేరియంట్‌పై వినియోగదారులు జూలై నెలలో గరిష్టంగా రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. టక్సన్ అనేది హ్యుందాయ్ ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక ప్రముఖ మోడల్. హ్యుందాయ్ కంపెనీ తరఫున అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూపై రూ.85,000 తగ్గింపు లభిస్తోంది. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ ఈ మోడల్ చాలా పాపులర్ కారు.
స్పోర్టివ్ లుక్, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే వెన్యూ N-లైన్ మోడల్‌పై కూడా ఇదే రూ.85,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ CNG వేరియంట్‌పై కూడా రూ.85,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది చిన్న కార్ల సెగ్మెంట్లో మంచి ఆప్షన్.
అత్యధిక డిస్కౌంట్ లభిస్తున్న హ్యుందాయ్ టక్సన్ ఫీచర్ల విషయానికి వస్తే.. టక్సన్ క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి కీలక ఫీచర్లు అందించారు.
హ్యుందాయ్ టక్సన్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.29.27 లక్షల నుండి టాప్ మోడల్‌లో రూ.36.04 లక్షల వరకు ఉంటుంది. జూలై నెల చివరి నాటికి ఈ ఆఫర్లు ముగుస్తాయి కాబట్టి, హ్యుందాయ్ కారు కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వెంటనే మీ దగ్గరి డీలర్‌షిప్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
