GST 2.0 : జీఎస్‌టీ 2.0 తర్వాత చవకైన బైక్‌లు.. స్ప్లెండర్ ప్లస్, షైన్ 100 DXపై భారీ తగ్గింపు
స్ప్లెండర్ ప్లస్, షైన్ 100 DXపై భారీ తగ్గింపు

GST 2.0 : కొత్త జీఎస్‌టీ 2.0 నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లు ఇప్పుడు మరింత చవకగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లైన హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 100 డీఎక్స్ కొత్త ధరలతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటి. జీఎస్‌టీ 2.0 అమలు తర్వాత ఈ బైక్ మరింత చవకగా మారింది. కంపెనీ దీని ధరలో ఏకంగా రూ.6,820 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ఈ బైక్ ప్రారంభ ధర రూ.73,902 నుండి మొదలై, టాప్ వేరియంట్‌కు రూ.80,471 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం స్టాండర్డ్, ఎక్స్‌టెక్, ఎక్స్‌టెక్ 2.0 అనే మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. ఇందులో ఎక్స్‌టెక్ 2.0 అత్యంత అడ్వాన్స్‌డ్ మోడల్.
స్ప్లెండర్ ప్లస్‌లో 97.2సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8హెచ్‌పీ పవర్, 8ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని అద్భుతమైన మైలేజ్, లో మెయింటెనెన్స్ ఖర్చు, విశ్వసనీయత కారణంగా స్ప్లెండర్ ప్లస్ చాలా కాలంగా భారతీయ కస్టమర్ల ఫస్ట ఆప్షన్‌గా ఉంది. ఎక్స్‌టెక్ 2.0 లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హోండా షైన్ 100 డీఎక్స్ కూడా జీఎస్‌టీ 2.0 తర్వాత చవకగా మారింది. కంపెనీ దీని ధరలో రూ.5,265 వరకు తగ్గింపు ఇచ్చింది. ఇప్పుడు దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.63,191, డీఎక్స్ వేరియంట్ ధర రూ.69,694 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోడల్ గతంలో రూ.74,959కి అందుబాటులో ఉండేది, అంటే దాదాపు రూ.5,000 తగ్గింది. ఇందులో 98.9సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 7.38హెచ్‌పీ పవర్, 8.05ఎన్‌ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కూడా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. షైన్ 100 డీఎక్స్‌లో ఎల్‌సీడీ డ్యాష్‌బోర్డ్, క్రోమ్ యాక్సెంట్లు, స్పోర్టీ గ్రాఫిక్స్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ధర విషయంలో చూస్తే హోండా షైన్ 100 డీఎక్స్, హీరో స్ప్లెండర్ ప్లస్ కంటే దాదాపు రూ.4,200 చవకగా ఉంది. అయితే, ఫీచర్లు, రైడింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే.. స్ప్లెండర్ ప్లస్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. స్ప్లెండర్ ప్లస్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ డిస్‌ప్లే వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు షైన్ 100 డీఎక్స్ తన లైట్ వెయిట్, సౌకర్యవంతమైన సస్పెన్షన్, మంచి పర్ఫార్మెన్స్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మైలేజ్ బైక్‌ను కోరుకుంటే హోండా షైన్ 100 డీఎక్స్ మంచి ఆప్షన్. కానీ కొంచెం ఎక్కువ ఫీచర్లు, ప్రీమియం ఎక్స్ పీరియన్స్ కోసం చూస్తున్నట్లయితే హీరో స్ప్లెండర్ ప్లస్ వ్యాల్యూ ఫర్ మనీగా నిలుస్తుంది.
