ఈ స్టైలిష్ బైక్ ధర ఎంతో తెలుసా ?

Harley Davidson X440 T : హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్‌సన్ మధ్య భాగస్వామ్యం మొదలై రెండు సంవత్సరాలు దాటింది. ఈ భాగస్వామ్యంలో విడుదలైన మొదటి బైక్ X440 మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఇదే మోటార్‌బైక్‌కు సంబంధించిన కొత్త మోడల్ X440 T భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. హార్లే డేవిడ్‌సన్ X440 T కొత్త, మరింత స్టైలిష్ లుక్‌తో వస్తుంది. ఈ కొత్త మోడల్ గత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా మరియు ఎక్కువ యాంగ్యులర్ డిజైన్‌తో కనిపించనుంది.

హార్లే డేవిడ్‌సన్ X440 T లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. ఈ బైక్ వెనుక భాగాన్ని త్రీ-క్వార్టర్ సెక్షన్‌లో రీ-డిజైన్ చేశారు, దీనివల్ల వెనుక భాగం మరింత ఎంగ్యులర్‌గా కనిపిస్తుంది. అలాగే, బైక్, బార్, మిర్రర్‌లలో కూడా కొన్ని మార్పులు చేసి, సరికొత్త లుక్‌ను ఇచ్చారు. కొత్త లుక్‌కు మరింత మెరుపు తీసుకురావడానికి కొత్త కలర్ థీమ్స్‌ను కూడా అందించారు. అయితే, ఈ కొత్త మోడల్ కూడా సాధారణ X440 బైక్ ఫ్రేమ్ మరియు బాడీని చాలా వరకు పోలి ఉంటుంది.

డిజైన్‌లో మార్పులు జరిగినప్పటికీ, హార్లే డేవిడ్‌సన్ X440 T బైక్ మెకానికల్ పరంగా ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్‌లో పాత మోడల్‌లో ఉన్న శక్తివంతమైన 440 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ నే కొనసాగించనున్నారు. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడింది. మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ సుమారు లీటరుకు 35 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌లో ఒకేసారి 13.5 లీటర్ల వరకు ఇంధనాన్ని నింపవచ్చు.

హార్లే డేవిడ్‌సన్ X440 T కొత్త మోడల్ ఇంకా భారతీయ మార్కెట్‌లో లాంచ్ కాలేదు. అయితే ఇది త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హార్లే డేవిడ్‌సన్ X440 ధరను పరిశీలిస్తే, ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2,39,500 నుంచి రూ.2,79,500 వరకు ఉంది. కొత్త మోడల్ అయిన X440 T ధర గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, కొత్త డిజైన్, స్వల్ప మార్పుల నేపథ్యంలో ఈ బైక్ ధర కూడా దాదాపు పాత X440 ప్రైస్-రేంజ్‌లోనే ఉండవచ్చని లేదా స్వల్పంగా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బైక్ లాంచ్ అయినప్పుడే దీని తుది ధర, వేరియంట్ల వివరాలు తెలుస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story