ఈ ఆల్-రౌండర్ స్కూటర్ కొనడానికి 5 ప్రధాన కారణాలివే

Hero Destini 110 : హీరో మోటోకార్ప్ తమ స్కూటర్ల శ్రేణిలో కొత్తగా హీరో డెస్టినీ 110ను పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ను డెస్టినీ 125 కంటే మరింత స్టైలిష్‌గా, మెరుగైన ఫీచర్లతో రూపొందించారు. దీని వీఎక్స్ కాస్ట్ డ్రమ్ వేరియంట్ ధర రూ.72,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, జెడ్ఎక్స్ కాస్ట్ డిస్క్ వేరియంట్ ధర రూ.79,000 వరకు ఉంటుంది. భారతీయ మార్కెట్‌లో ఇది టీవీఎస్ జూపిటర్ 110, హోండా యాక్టివా 110 వంటి స్కూటర్లకు బలమైన పోటీని ఇస్తుంది. డెస్టినీ 110ని కొనుగోలు చేయడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. సరసమైన ధర :

డెస్టినీ 110 అతి పెద్ద ఆకర్షణ దాని ప్రారంభ ధర. కేవలం రూ.72,000 ధరతో లాంచ్ చేయబడిన ఈ స్కూటర్, తన సెగ్మెంట్‌లోని ప్రముఖ స్కూటర్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది హోండా యాక్టివా 110 కంటే కూడా తక్కువ ధరలో లభిస్తుంది. కాబట్టి, బడ్జెట్‌లో ఒక మంచి స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది చాలా చక్కటి ఎంపిక.

2. ప్రీమియం డిజైన్, అద్భుతమైన ఫీచర్లు:

హీరో కంపెనీ డెస్టినీ 110ని కొత్త రెట్రో-డిజైన్ లాంగ్వేజ్లో రూపొందించింది, ఇది స్కూటర్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇందులో క్రోమ్ ఎక్సెంట్స్, ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, H-ఆకారంలో ఉన్న LED టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఈ స్కూటర్‌ను ఇతర స్కూటర్ల కంటే విభిన్నంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా, 785 మి.మీ. పొడవైన సీటు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్లవ్ బాక్స్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు దీన్ని మరింత ఉపయోగకరంగా మారుస్తాయి. టాప్ వేరియంట్ ZXలో 190 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది, ఇది సేఫ్టీ పరంగా పెద్ద ప్లస్ పాయింట్.

3. పవర్ఫుల్ ఇంజిన్, స్పెసిఫికేషన్స్:

ఈ స్కూటర్‌లో 110 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 7.9 bhp పవర్, 8.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ఈ ఇంజిన్ చాలా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక షాక్ అబ్జార్బర్ కూడా ఉన్నాయి. అలాగే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

4. అద్భుతమైన మైలేజ్:

కొత్త స్కూటర్ కొనేటప్పుడు చాలా మంది ముందుగా చూసేది దాని మైలేజ్. హీరో డెస్టినీ 110 విషయంలో మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఈ స్కూటర్ లీటరుకు 56.2 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇందులో హీరో ప్రత్యేక i3S (ఐడిల్-స్టాప్-స్టార్ట్ సిస్టమ్), వన్-వే క్లచ్ టెక్నాలజీలను ఉపయోగించారు. ఇవి ట్రాఫిక్‌లో ఆగడం, మళ్లీ కదలడం వంటి సందర్భాలలో ఇంధనాన్ని ఆదా చేస్తాయి. దీంతో, రోజువారీ ఆఫీస్‌కు వెళ్లే వారికి లేదా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5. పోటీ, బెనిఫిట్స్ :

హీరో డెస్టినీ 110 నేరుగా హోండా యాక్టివా 110, టీవీఎస్ జూపిటర్‌లతో పోటీపడుతుంది. యాక్టివా దాని విశ్వసనీయత, బ్రాండ్ విలువకు పేరు పొందింది. అయితే, డెస్టినీ 110 తక్కువ ధరతో పాటు, పొడవైన సీటు, ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందిస్తుంది. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని, ప్రయోజనాలను చేకూరుస్తుంది. అన్నింటినీ కలిపి చూస్తే, హీరో డెస్టినీ 110 బడ్జెట్‌లో ఒక పూర్తి స్థాయి ఆల్-రౌండర్ స్కూటర్‌గా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story