హీరో హెచ్ఎఫ్ సిరీస్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

Hero : భారతీయ రోడ్లపై సామాన్యుడి నేస్తం అంటే అది ఖచ్చితంగా హీరో బైకే. తక్కువ ధర, ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి హీరో హెచ్ఎఫ్ సిరీస్ ఎప్పుడూ మొదటి ఛాయిస్. మీరు రోజూ ఆఫీసుకి వెళ్లాలన్నా లేదా చిన్న చిన్న పనుల కోసం ఒక నమ్మకమైన బైక్ కావాలన్నా, ఈ 100 సీసీ బైక్ సూపర్ ఆప్షన్. దీనిలో విశేషం ఏంటంటే, మీరు ఏ వేరియంట్ కొన్నా ఇంజిన్ పవర్ ఒకేలా ఉంటుంది, కేవలం ఫీచర్లు, లుక్స్ మాత్రమే మారుతుంటాయి. అందుకే మీ బడ్జెట్‌ను బట్టి సరైన వేరియంట్ ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంజిన్ పవర్, పర్ఫామెన్స్

హీరో హెచ్ఎఫ్ సిరీస్‌లోని అన్ని మోడల్స్ లోనూ 97.2 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8hp పవర్, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగరం లోపల ట్రాఫిక్ లో నడపడానికి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. దీని మైలేజీ సుమారుగా 65 నుంచి 70 కిలోమీటర్ల వరకు వస్తుంది, అందుకే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఫేవరెట్ బైక్ అయ్యింది.

హెచ్ఎఫ్ డీలక్స్ ఆల్-బ్లాక్

ఈ సిరీస్ లో అత్యంత తక్కువ ధరలో లభించే మోడల్ HF Deluxe All-Black. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.57,657. దీనిలో సెల్ఫ్ స్టార్ట్ ఉండదు, కేవలం కిక్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. అయితే, దీని ఆల్-బ్లాక్ లుక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లు, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హెచ్ఎఫ్ 100

దీని తర్వాత వచ్చే మోడల్ HF 100. దీని ధర సుమారు రూ.59,839. దీనిలో ట్యూబ్ టైర్లు, కొంచెం చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి. ఫీచర్లు దాదాపు ఆల్-బ్లాక్ మోడల్ లాగే ఉన్నా, దీనిలో కలర్ ఆప్షన్లు కొంచెం ఎక్కువగా లభిస్తాయి. సింపుల్ గా, రోజూ పనులకు వెళ్లేవారికి ఇది సరైన ఛాయిస్.

హెచ్ఎఫ్ డీలక్స్ కిక్, సెల్ఫ్ వేరియంట్లు

మీకు ఇంకా ఎక్కువ కలర్ ఆప్షన్లు కావాలంటే HF Deluxe Kick వేరియంట్ చూడవచ్చు, దీని ధర రూ.61,457. ఇకపోతే, సౌకర్యం కోరుకునే వారి కోసం HF Deluxe Self అందుబాటులో ఉంది. దీని ధర రూ.66,664. దీనిలో కిక్ స్టార్ట్‌తో పాటు సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉండటం వల్ల ట్రాఫిక్ లో బైక్ స్టార్ట్ చేయడం చాలా సులభం అవుతుంది.

i3S టెక్నాలజీతో టాప్ మోడల్

ఈ సిరీస్ లో అన్నిటికంటే టాప్ మోడల్ HF Deluxe i3S. దీనిలో హీరో పేటెంట్ పొందిన i3S టెక్నాలజీ ఉంటుంది. ఇది ట్రాఫిక్ లో సిగ్నల్ పడినప్పుడు బైక్ ఐడిల్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆఫ్ చేస్తుంది, మళ్లీ క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పెట్రోల్ చాలా ఆదా అవుతుంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ టెక్నాలజీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story