క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్స్‌తో హీరో కొత్త బైక్

Hero Xtreme 160R 4V : హీరో మోటోకార్ప్ తమ పాపులర్ స్పోర్ట్స్-కమ్యూటర్ బైక్ అయిన ఎక్స్‌ట్రీమ్ 160R 4Vలో సరికొత్త, స్పెషల్ కాంబాట్ ఎడిషన్‎ను విడుదల చేసింది. 160సీసీ బైక్ కేటగిరీలో ఒక యూనిక్, స్పోర్టీ, టెక్నాలజీతో కూడిన బైక్‌ను కోరుకునే రైడర్స్ కోసం ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో సెగ్మెంట్‌లో మొదటిసారిగా వస్తున్న అనేక హై-టెక్ ఫీచర్లను జోడించడం వల్ల, స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కాంబాట్ ఎడిషన్ చూడటానికి పూర్తిగా కొత్తగా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని డిజైన్ యూత్‎ను టార్గెట్ చేసుకుని మరింత ప్రీమియంగా తయారు చేశారు. కంపెనీ ఇందులో కొత్తగా కాంబాట్ గ్రే కలర్‌ను అందించింది. హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఇది ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ 250R హెడ్‌ల్యాంప్‌ను పోలి ఉంటుంది. ఈ మార్పుల వల్ల బైక్ ముందు భాగం మరింత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తోంది. ఇది స్టాండర్డ్ వెర్షన్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంది.

కాంబాట్ ఎడిషన్ అతిపెద్ద ఆకర్షణ దీనిలోని ఫీచర్లు. 160సీసీ విభాగంలో ఇప్పటివరకు చూడని కొత్త టెక్నాలజీని హీరో ఇందులో పరిచయం చేసింది. ఈ కేటగిరీలో మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను జోడించారు. ఇది సుదూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్డు పరిస్థితి, రైడింగ్ స్టైల్‌కు అనుగుణంగా పెర్ఫార్మెన్స్‌ను మార్చుకునేందుకు రైన్, రోడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌ను ఇచ్చారు.

రైడ్-బై-వైర్ టెక్నాలజీ థ్రాటిల్ రెస్పాన్స్‌ను మరింత స్మూత్‌గా చేస్తుంది. కొత్త ఫుల్-కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే బైక్‌కు మోడ్రన్, హై-టెక్ ఫీలింగ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, 0–60 km/h టైమ్, క్వార్టర్-మైల్ రికార్డర్ వంటి ఫీచర్లు స్పోర్టీ రైడర్‌లకు తమ బైక్ పెర్ఫార్మెన్స్‌ను పర్యవేక్షించుకునే అవకాశం ఇస్తాయి.

కాంబాట్ ఎడిషన్ ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండర్డ్ ఎక్స్‌ట్రీమ్ 160R 4V లో ఉన్న పవర్ఫుల్ ఇంజనే ఇందులో కూడా ఉంది. ఇది 163cc, 4-వాల్వ్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్. ఈ ఇంజన్ 16.66 hp పవర్‌ను, 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిటీ ట్రాఫిక్ నుంచి హైవే రైడ్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ వేగవంతమైన, రిఫైన్డ్, మంచి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. కొత్త ఫీచర్లు చేరడంతో ఈ ఎడిషన్ తన సెగ్మెంట్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్ బైక్‌గా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story