క్రూయిజ్ కంట్రోల్‌తో ఎక్స్‌ట్రీమ్ 160R 4V విడుదల

Hero Xtreme 160R 4V : బైక్ లవర్స్‌కు హీరో మోటోకార్ప్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో బాగా పాపులర్ అయిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160Rలో కొత్త 4V క్రూయిజ్ కంట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ స్టాండర్డ్ మోడల్ కంటే చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చింది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ చేసేవారికి ఉపయోగపడే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను 160cc సెగ్మెంట్‌లో తొలిసారిగా తీసుకురావడం దీని ప్రత్యేకత. మరి ఈ బైక్ ఫీచర్లు, ధర, ఇతర అప్‌డేట్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ కొత్త ఎక్స్‌ట్రీమ్ 160R 4V క్రూయిజ్ కంట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,34,100. ఇది స్టాండర్డ్ మోడల్ ధర కంటే దాదాపు రూ.4,500 ఎక్కువగా ఉంది. ఈ ధర పెరగడానికి ప్రధాన కారణం ఇందులో చేర్చిన అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, టెక్నాలజీ అప్‌డేట్స్‌ మాత్రమే.

కొత్త వేరియంట్‌లో ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న 163.2cc సింగిల్-సిలిండర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ నే ఇక్కడ కూడా వాడారు. ఈ ఇంజిన్ 8,500 RPM వద్ద 16.9hp పవర్, 6,500 RPM వద్ద 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫార్మెన్స్ మారకపోయినా, ఫీచర్ల పరంగా ఇది ఇప్పుడు తన సెగ్మెంట్‌లో అత్యంత ప్రీమియం బైక్‌గా నిలిచింది.

ఈ బైక్‌లో అతిపెద్ద అప్‌డేట్, ప్రత్యేక ఆకర్షణ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్. 160cc సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌ను అందించిన మొట్టమొదటి బైక్ ఇదే కావడం విశేషం. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు, రైడర్ యాక్సిలరేటర్ నొక్కాల్సిన అవసరం లేకుండానే, బైక్ ఒక నిర్ణీత వేగంలో స్థిరంగా దూసుకుపోతుంది. ఈ ఫీచర్ సుదూర ప్రయాణాలను మరింత సులభతరం చేస్తుంది.

ఈ బైక్‌లో సాంప్రదాయ థ్రాటిల్ కేబుల్ స్థానంలో రైడ్-బై-వైర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది మరింత కచ్చితమైన, వేగవంతమైన యాక్సిలరేషన్ కంట్రోల్‌ను ఇస్తుంది. ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్‌ను ఇచ్చారు – అవి రైన్, రోడ్, స్పోర్ట్. రైడర్ రోడ్డు పరిస్థితిని బట్టి వీటిని సులభంగా మార్చుకోవచ్చు. ఈ బైక్‌కు కొత్తగా డిజైన్ చేసిన LED హెడ్‌లైట్‌ను అమర్చారు. ఇది చూడటానికి హీరో ఎక్స్‌ట్రీమ్ 250R బైక్‌లాగా కనిపిస్తుంది.

స్పీడ్, గేర్ పొజిషన్, ఫ్యూయల్, ఇతర సమాచారాన్ని స్పష్టంగా చూపించే 4.2 అంగుళాల కొత్త కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ను అందించారు. రైడ్ మోడ్‌లను మార్చడానికి, క్రూయిజ్ కంట్రోల్‌ను ఆన్/ఆఫ్ చేయడానికి వీలుగా హ్యాండిల్‌బార్‌పై కొత్త స్విచ్‌గేర్ సెటప్‌ను ఇచ్చారు. బైక్‌కు కొత్త గ్రాఫిక్స్, నాలుగు కొత్త కలర్ ఆప్షన్లను జోడించారు. దీంతో బైక్ లుక్ మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా మారింది. మొత్తంగా కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V క్రూయిజ్ కంట్రోల్ వేరియంట్ అనేది స్పోర్టీ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీల కలయికగా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story