డైలీ ఆఫీస్ ట్రిప్‌కి బెస్ట్ స్కూటర్

Honda Activa 6G : రోజువారీ ఆఫీస్ ప్రయాణానికి నమ్మకమైన, అద్భుతమైన మైలేజీని అందించే స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే హోండా 2వీలర్స్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ హోండా యాక్టివా తీసుకోవచ్చు. ఈ స్కూటర్ రోడ్లపై మాత్రమే కాకుండా సంవత్సరాలుగా వినియోగదారుల హృదయాల్లో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. యాక్టివా 6జీ లో కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇది ఒక లీటర్ పెట్రోల్‌కు ఎంత మైలేజీని ఇస్తుంది అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

మైలేజ్, ఫుల్ ట్యాంక్ రేంజ్ లెక్కలు

హోండా కంపెనీ యాక్టివా 110 సీసీ మోడల్‌కు 59.5 కి.మీ.ల మైలేజ్ (ARAI క్లెయిమ్) ఇస్తుందని చెబుతోంది. అయితే నిజ జీవితంలో రోడ్ కండిషన్స్, స్కూటర్ మెయింటెనెన్స్‌ను బట్టి కొందరు వినియోగదారులు 40 నుంచి 47 కి.మీ.ల మైలేజీని పొందుతున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్‌లో 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఒకవేళ 110 సీసీ యాక్టివా మోడల్ ఒక లీటరుకు సగటున 45 కి.మీ.ల మైలేజీని ఇస్తుందనుకుంటే, ఫుల్ ట్యాంక్‌తో ఇది 238.5 కి.మీ.ల దూరం వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుత పెట్రోల్ ధర (ఢిల్లీలో రూ.94.77) ప్రకారం.. 5.3 లీటర్ల ట్యాంక్‌ను ఫుల్ చేయడానికి సుమారు రూ.502 వరకు ఖర్చు అవుతుంది.

ఇంజిన్, ధర వివరాలు

హోండా యాక్టివా స్కూటర్ 110 సీసీ, 125 సీసీ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. యాక్టివా 110 సీసీ మోడల్‌లో 109.51సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ BS6 ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 7.79PS పవర్‌ను, 9.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. 110 సీసీ ఇంజిన్ ఉన్న హోండా యాక్టివా ధర రూ.75,182 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ కొనాలంటే సుమారు రూ.88,507 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, వివిధ నగరాల్లో ఈ స్కూటర్ ఆన్-రోడ్ ధరలు మారుతుంటాయి. ఈ ధరల రేంజ్‌లో యాక్టివాకు టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story