ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కాల్సిందే

Honda : జపాన్‌కు చెందిన హోండా సంస్థ, తన పాపులర్ మ్యాక్సీ స్కూటర్ అయిన ఏడీవీ 350.. 2026 ఎడిషన్‌ను యూరప్‌లో రిలీజ్ చేసింది. 2022లో తొలిసారిగా యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్కూటర్, అప్పటి నుంచి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. కొత్త 2026 మోడల్‌లో హోండా కొన్ని విజువల్ ఛేంజెస్ చేసింది. అయితే, దీని ఇంజిన్, మెకానికల్ భాగాలు మాత్రం పాత మోడల్‌లో ఉన్నట్టే కొనసాగుతున్నాయి. 2026 హోండా ఏడీవీ 350 ఇప్పుడు తాజా గ్రాఫిక్స్‌ తో పాటు, మూడు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పులు స్కూటర్‌కు మునుపటి కంటే మరింత స్టైలిష్, లేటెస్ట్ లుక్ ఇచ్చాయి. యూరప్‌లోని యంగ్ రైడర్లను, సాహసయాత్రలు చేసే వారిని మరింత ఆకర్షించే విధంగా హోండా దీని డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

హోండా ఏడీవీ 350 లో 330cc SOHC, 4-వాల్వ్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ సుమారు 30 హార్స్‌పవర్ ఎనర్జీని, 31.5 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ అండర్‌బోన్ ఫ్రేమ్‌పై అమర్చబడి ఉంది. ఇది స్కూటర్ బ్యాలెన్స్, స్టెబిలిటీని మెరుగుపరుస్తుంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి, ఇవి కచ్చా రోడ్లపై కూడా స్మూత్ ట్రావెల్ ఎక్సపీరియన్స్ అందిస్తాయి.

ఈ మ్యాక్సీ స్కూటర్‌లో టెక్నాలజీ, సౌకర్యాన్ని పెంచే అనేక ఫీచర్లను అందించారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 256ఎంఎం, వెనుక భాగంలో 240ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 15-అంగుళాల, వెనుక భాగంలో 14-అంగుళాల చక్రాలు అమర్చారు. 2025 అప్‌డేట్‌లో చేర్చిన అధునాతన ఫీచర్లను 2026 మోడల్‌లోనూ కొనసాగించారు. వీటిలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో లైట్, ఆటో-క్యాన్సిల్ ఇండికేటర్లు వంటివి ఉన్నాయి. ఇది మ్యాక్సీ స్కూటర్ కాబట్టి, ఇందులో 11.7 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

ప్రస్తుతానికి ఏడీవీ 350ని భారతదేశంలో విడుదల చేసేందుకు హోండా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్‌ఎక్స్ఆర్ 160 వంటి మ్యాక్సీ స్కూటర్ల సక్సెస్ దృష్టిలో ఉంచుకుంటే, భవిష్యత్తులో ఈ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే, దీని అడ్వాన్సుడ్ ఫీచర్లు, ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్ల కారణంగా, భారతదేశంలో దీని ధర సుమారు రూ.4 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇది భారత్‌లో విడుదలైతే, హై-ఎండ్ స్కూటర్లను ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కాగలదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story