Honda Amaze : హోండా అమేజ్ పై ఏకంగా రూ.57,200తగ్గింపు.. ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు
ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు

Honda Amaze : మారుతి సుజుకి డిజైర్‌కు గట్టి పోటీనిచ్చే హోండా అమేజ్ కారును తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. మీరు కూడా కొత్త సబ్-కాంపాక్ట్ సెడాన్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, హోండా అమేజ్, మారుతి డిజైర్ ఈ రెండు మోడల్స్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం. కేవలం తగ్గింపుల గురించే కాకుండా ఈ రెండు కార్ల ధరల గురించి కూడా పూర్తి సమాచారం చూద్దాం.
హోండా అమేజ్‌పై ఎంత తగ్గింపు?
కొత్త హోండా అమేజ్‌పై నగదు తగ్గింపు లేకపోయినా, కార్పొరేట్ డిస్కౌంట్స్, హోండాకు చెందిన పాత వినియోగదారుల కోసం ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నారు. అయితే, కొత్త మోడల్‌పై కాకుండా రెండవ తరం అమేజ్ మోడల్‌పై ఏకంగా రూ. 57,200 వరకు తగ్గింపు లభిస్తోంది. హోండా ఈ కాంపాక్ట్ సెడాన్ కారు మారుతి సుజుకి డిజైర్‌కు గట్టి పోటీనిస్తుంది. ఈ ఆఫర్లు, తగ్గింపులు స్టాక్ ఉన్నంత వరకే చెల్లుబాటు అవుతాయని గమనించాలి. మరింత కచ్చితమైన సమాచారం కోసం దగ్గర్లోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.
హోండా అమేజ్ ధర, మైలేజ్ వివరాలు:
1199 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ హోండా కారు ధర రూ. రూ. 7,62,800 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మైలేజ్ విషయానికి వస్తే, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం కారు ఒక లీటర్ పెట్రోల్‌కు 18.6 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించగలదు. ఈ కారును 5-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.
మారుతి డిజైర్‌పై డిస్కౌంట్ ఉందా?
కార్‌టాక్ వెబ్‌సైట్ ప్రకారం.. హోండా అమేజ్‌కు పోటీనిచ్చే మారుతి డిజైర్ కారుపై ప్రస్తుతానికి ఎటువంటి తగ్గింపులు లేవు. ధర విషయానికి వస్తే ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.6,83,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు టాప్ వేరియంట్ కొనడానికి మీరు రూ. 10,19,001 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. హోండా అమేజ్‌పై లభించే తగ్గింపు ప్రయోజనాన్ని జూన్ 30, 2025 వరకు మాత్రమే పొందగలుగుతారు.
