Honda : కేటీఎంకు సవాల్.. రూ.21లు తగ్గిన హోండా పాపులర్ బైక్ ధర
రూ.21లు తగ్గిన హోండా పాపులర్ బైక్ ధర

Honda :హోండా కంపెనీ తమ 350 సీసీ కన్నా తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై జిఎస్‌టి పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ ప్రకటన సమయంలో హోండా CB300R ఈ జాబితాలో లేనప్పటికీ ఇప్పుడు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బైక్ ధరను కూడా సవరించింది. కొత్త ధరల ప్రకారం, హోండా CB300R ఎక్స్-షోరూమ్ ధర రూ.2.40 లక్షల నుండి రూ.2.19 లక్షలకు తగ్గింది. అంటే, ఈ బైక్ ధరలో ఏకంగా రూ.21,000 తగ్గింపు లభించింది. ఈ భారీ తగ్గింపుతో హోండా CB300R ఇప్పుడు మార్కెట్‌లో తన ప్రత్యర్థులకు మరింత పోటీని ఇవ్వనుంది.
ధరలో తగ్గింపు తర్వాత.. హోండా CB300R తన సెగ్మెంట్‌లో మరింత స్ట్రాంగ్ ఆప్షన్ గా మారింది. ఇది ఇప్పుడు మార్కెట్‌లోని ప్రముఖ బైక్‌లైన KTM 250 డ్యూక్ (రూ.2.12 లక్షలు), ట్రయంఫ్ స్పీడ్ 400 (రూ.2.50 లక్షలు), టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 310 (రూ.2.21 లక్షల నుండి రూ.2.87 లక్షలు) వంటి బైక్‌లతో నేరుగా పోటీ పడుతుంది. ఈ బైక్‌లో కంపెనీ 286 సీసీ సింగిల్-సిలిండర్, DOHC, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చింది. ఈ ఇంజిన్ 31 హార్స్‌పవర్ ఎనర్జీ, 27.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది, ఇది రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
హోండా CB300R మొదట్లో రూ.2.77 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశంలో ఉత్పత్తిని, స్థానికీకరణను పెంచడం ద్వారా దీని ధరను రూ.2.40 లక్షలకు తగ్గించారు. ఇప్పుడు జిఎస్‌టి సవరణ తర్వాత, రూ.2.19 లక్షల ధర దీన్ని మరింత వాల్యూ-ఫుల్ అంటే డబ్బుకు తగ్గ విలువను అందించే బైక్‌గా మార్చింది. ఈ ధరల తగ్గింపు బైక్ లవర్స్‌కు ఇది ఒక గొప్ప వార్త.
హోండా CB300R ఒక ప్రత్యేకమైన నియో స్పోర్ట్స్ కేఫ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దీనికి స్టైలిష్, ఆధునిక లుక్‌ను ఇస్తుంది. సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, అలాగే రైడింగ్ సౌలభ్యం కోసం అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తిగా డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. మెరుగైన నియంత్రణ మరియు రైడింగ్ కంఫర్ట్ కోసం అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్ తో కూడిన ఛాసిస్ డిజైన్ దీని సొంతం. ఈ డిజైన్, ఫీచర్లు బైక్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఒకవైపు CB300R ధరలో తగ్గింపు లభించగా, మరోవైపు హోండాకు చెందిన ఇతర బిగ్‌వింగ్ మోడల్స్ అయిన NX500, రెబెల్ 500, CBR650R వంటి వాటి ధరలు జిఎస్‌టి సవరణ తర్వాత కొద్దిగా పెరిగాయి.

