హోండా హైనెస్ సిబి 350 ఈఎంఐ లెక్కలు ఇవే

Honda CB350 H'ness : భారతదేశంలో 350cc బైక్ సెగ్మెంట్ ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ విభాగంలో దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరుగులేని రారాజుగా వెలుగొందుతోంది. అయితే, ఈ మొనగాడికి సవాల్ విసురుతూ జపాన్ దిగ్గజం హోండా సిబి 350 హైనెస్ను రంగంలోకి దించింది. క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లు, అదిరిపోయే ఇంజిన్ స్మూత్‌నెస్‌తో ఈ బైక్ యువతను తెగ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో, ఆ లెక్కలేంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

హోండా సీబీ 350 హైనెస్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి DLX, DLX Pro, టాప్ మోడల్ DLX Pro Chrome. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.1,92,435 నుంచి రూ.1,97,003 మధ్యలో ఉన్నాయి. రెట్రో డిజైన్ తో పాటు హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి ఇది గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది రైడర్లు దీని గంభీరమైన శబ్దం, హోండా బ్రాండ్ పై ఉన్న నమ్మకంతో దీని వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇక ఈఎంఐ లెక్కల్లోకి వస్తే.. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ DLX Pro Chromeను ఎంచుకున్నారని అనుకుందాం. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,97,003. మీరు ఈ మొత్తంపై 9.5% వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, కాలపరిమితిని బట్టి ఈఎంఐ ఇలా ఉంటుంది. మీరు కేవలం 12 నెలల (ఒక ఏడాది) కాలపరిమితి ఎంచుకుంటే, నెలకు సుమారు రూ.17,274 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఏడాది తిరిగేసరికి మీరు అసలుతో పాటు అదనంగా రూ.10,284 వడ్డీ చెల్లిస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఈఎంఐ కట్టగలిగే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఒకవేళ నెలకు అంత భారం వద్దు అనుకుంటే.. 24 నెలల (రెండేళ్లు) ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.9,045కు తగ్గుతుంది. కానీ ఇక్కడ వడ్డీ భారం రూ.20,084కు పెరుగుతుంది. ఇంకా తక్కువ ఈఎంఐ కావాలనుకునే వారు 36 నెలల (మూడేళ్లు) కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అప్పుడు నెలకు కేవలం రూ.6,311 కడితే సరిపోతుంది. అయితే, మూడేళ్ల కాలానికి మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ.30,178 కి చేరుకుంటుంది. అందుకే లోన్ తీసుకునే ముందు మీ నెలవారీ ఆదాయాన్ని, బడ్జెట్‌ను లెక్కించుకుని సరైన కాలపరిమితిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story