మార్కెట్లో హోండా చిన్న కారు

Honda N-One e : హోండా ప్రస్తుతం తన కార్లన్నింటిలో కెల్లా అతి చిన్న ఎలక్ట్రిక్ కారు Honda N-One eను పరిచయం చేసింది. ఈ కారును ముఖ్యంగా సిటీల్లో నివసించే వారి కోసం తయారు చేశారు. దీని కాంపాక్ట్ సైజు ఇరుకైన వీధుల్లో, ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మినీ ఎలక్ట్రిక్ వెహికల్ సెప్టెంబర్ 2025 నాటికి జపాన్‌లో అమ్మకానికి రానుంది. ఆ తర్వాత దీన్ని యూకేలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

Honda N-One e డిజైన్ రెట్రో స్టైల్‌లో, చాలా సింపుల్‌గా ఉంది. గుండ్రటి హెడ్‌లైట్లు, బాక్సీ బాడీ, కర్వీ బంపర్‌తో ఆకట్టుకుంటుంది. దీని గ్రిల్ మూసి ఉంటుంది, దానిలోనే ఛార్జింగ్ పోర్ట్ కూడా చక్కగా అమర్చారు. ఈ కారు దాదాపు 3,400 మి.మీ. పొడవు ఉండొచ్చు. ఇది జపాన్ కేయ్ కార్ కేటగిరీలోకి వస్తుంది. ఈ కారు చిన్నదిగా, స్టైలిష్‌గా ఉండటంతో రద్దీగా ఉండే సిటీ ప్రయాణాలకు ఇది మంచి ఆప్షన్ కావచ్చు.

హోండా ఈ కారు లోపలి డిజైన్‌ను చాలా క్లీన్‌గా, సింపుల్‌గా ఉంచింది. ఇందులో ఫిజికల్ బటన్లు, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కింద చిన్న స్టోరేజ్ షెల్ఫ్, ఎక్కువ సామాను పెట్టుకోవడానికి 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లు ఉన్నాయి. ఈ కారులో వెహికల్-టు-లోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీని ద్వారా కారు బ్యాటరీతో చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయవచ్చు లేదా నడపవచ్చు. దీనికి అవసరమైన అడాప్టర్లు హోండా యాక్సెసరీ దుకాణాల్లో లభిస్తాయి.

ఈ కారులో Honda N-Van e ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 245 కి.మీ.ల రేంజ్ ఇవ్వగలదు. ఇది 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల కేవలం 30 నిమిషాల్లోనే గణనీయంగా ఛార్జ్ అవుతుంది. ఈ కారు దాదాపు 63 bhp పవర్ అవుట్‌పుట్‌ను ఇవ్వగలదు. నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఇది సరిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story