Honda : హోండా నుంచి అదిరిపోయే బైక్స్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్
తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్

Honda : హోండా కంపెనీ భారత మార్కెట్‌లో రెండు కొత్త బైక్‌లను విడుదల చేసింది. అద్భుతమైన మైలేజీ, అదిరిపోయే ఫీచర్లతో హోండా CB125 హార్నెట్, షైన్ 100 DXలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ బైక్‌ల ధరలను కూడా ప్రకటించింది. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా వీటి ధరలు నిర్ణయించారు.
హోండా CB125 హార్నెట్
ఈ బైక్ ధర రూ.1.21 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా, మస్కులర్‌గా ఉంటుంది. గోల్డెన్ కలర్ ఫ్రంట్ ఫోర్క్స్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. ఈ బైక్‌లో ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్, యూఎస్‌బీ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 123.94cc ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5.4 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుంది.
హోండా షైన్ 100 DX
ఈ బైక్ ధర రూ.74,959 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కమ్యూటర్ బైక్‌లో కొత్త గ్రాఫిక్స్, పొడవైన సీటు, డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉన్నాయి. ఇందులో eSP టెక్నాలజీతో కూడిన 98.98cc ఇంజిన్ ఉంది. ఈ బైక్ పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, జెన్నీ గ్రే మెటాలిక్ రంగులలో లభిస్తుంది. ఈ రెండు బైక్‌ల డెలివరీలు ఆగస్టు 2025 మధ్య నుంచి మొదలవుతాయి. హోండా వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు.
