Honda : భారతదేశంలో లగ్జరీ, గ్రీన్ మొబిలిటీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ కారును భారత్‌లో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ మంగళవారం విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌కు Honda ZR-V eHEVగా పేరు ఖరారు చేశారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని మే 22, 2026 న భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఎలివేట్ కంటే పై స్థానంలో, అల్ట్రా ప్రీమియం లుక్‌తో దీనిని నిలబెట్టబోతున్నారు. విదేశాల నుంచి నేరుగా సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో ఈ కారు ఇండియాకు ఇంపోర్ట్ కానుంది.

హోండా విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ కారు ఫ్రంట్ డిజైన్ చాలా అగ్రెసివ్, స్పోర్టీగా కనిపిస్తోంది. ఇందులో సరికొత్త షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వాటితో పాటు ఎల్-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (DRLs) ఇచ్చారు. ఇది కారుకు విదేశీ లగ్జరీ లుక్‌ను తెచ్చిపెడుతోంది. దీని రూఫ్‌లైన్ వెనుక వైపు వంగి ఉండి ఒక పవర్‌ఫుల్ కూపే స్టైల్‌ను గుర్తుచేస్తుంది. గ్లోబల్ మోడల్ లాగే ఇండియా వేరియంట్‌లో కూడా క్రోమ్ గ్రిల్, హనీకోంబ్ స్టైల్ ఎయిర్ ఇన్‌టేక్స్, రూఫ్ రైల్స్, భారీ పనోరమిక్ సన్రూఫ్ ఉండబోతున్నాయి. దీని పొడవు 4,568 మిమీ, వెడల్పు 1,840 మిమీగా ఉండటంతో రోడ్డుపై దీని ప్రెజెన్స్ చాలా గంభీరంగా ఉండనుంది. ఇందులో 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 390 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తాయి.

ఈ కారులోని అసలైన మ్యాజిక్ దాని ఇంజిన్‌లోనే ఉంది. ఇందులో 2.0-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది ఇ-సివిటి (e-CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి వస్తుంది. ఈ పవర్‌ఫుల్ సెటప్ దాదాపు 180 హార్స్‌పవర్ (hp) శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. జస్ట్ 8 సెకన్లలోనే ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 170 కిమీ. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. డ్యూయల్-టోన్ క్యాబిన్, 10.2 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, 12-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, సేఫ్టీ కోసం లెవెల్-2 ADAS సేఫ్టీ టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్నారు. ఇండియాలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story